నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే ఉమ్మడి పాలమూరు జిల్లాను పలుకరించాయి. చాలాకాలం తర్వాత మే నెలలోనే రావడం శుభపరిణామంగా రైతులు భావిస్తున్నారు. సీజన్ ప్రారంభం కాకముందే వరుణుడు కరుణించడంతో ఆశలు చిగురించాయి. ఈ వానకాలం వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోటి ఆశలతో అన్నదాతలు పంటల సాగు మొదలుపెట్టారు. పలు చోట్ల కర్షకులు పొలంబా ట పట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు భరోసా ఇవ్వకపోడంతో పెట్టుబడులు తడిసి మోపడవడం ఖాయమని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఓ వైపు రుతుపవనా లు వచ్చాయన్న సంతోషం ఉన్నా.. మరోవైపు భూమి పుత్రులను భయం వెంటాడుతున్నది. గ తేడాది వేసిన పంటను అనుకున్న స్థాయిలో ప్ర భుత్వం కొనుగోలు చేయకపోవడం.. మద్దతు ధర ఆశించిన స్థాయిలో రాకపోవడం.. ఇప్పటికీ కొందరి రైతుల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడం.. వర్షాలకు తడుచి మొలకెత్తుతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ తరుణంలో దేవుడిపై భారం వేసిన అన్నదాత లు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్