కొల్లాపూర్, అక్టోబర్ 3 : ప్రపంచ దేశాలల్లో నాణ్యమైన పత్తి సాగు అయ్యే ప్రాంతాల్లో తెలంగాణకు ప్రత్యే క స్థానం ఉన్నది. అందుకే ఇక్కడి ప్రాంతాల్లో పండించిన పత్తి పంట నాణ్యత రీత్యా ఎగుమతి కూడా అవుతున్నది. అయితే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా పత్తి పంట సాగు కావడం లేదు. దీంతో దేశంలోకి దూ దిని సుంకాలు లేకుండా ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్నది. గతంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే దూదిపై కేంద్ర ప్రభుత్వం 11శాతం సుంకాలు విధించేది కానీ ఇప్పుడు దూది దిగుమతిపై సుంకాలు రద్దు చేయడంతో దూది దిగుమతి భారీగా పెరిగింది. పత్తికి ఉన్న డిమాండ్ రీత్యా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పత్తిపంట సాగును ప్రోత్సహించింది. కానీ కాంగ్రెస్ పాలనలో పంటల ప్రోత్సాహం సంగతి ఏమో కానీ పత్తి పం ట సాగు చేస్తున్న రైతుల ఉసురు తీస్తున్నది. రైతుల డిమాండ్ అవసరాల మేరకు యూరియాను సరఫరా చేయకపోవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పత్తి పంట సాగు చేసి గోస పడుతున్న రైతుల వ్యథపై ప్రత్యేక కథనం..
నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎనభై వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పత్తి పంటను సంప్రదాయ పంటగా సాగుచేస్తున్న రైతులకు ఏడాదికేడాది దిగుబడిలో పెద్దగా మార్పులు రావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్‌పై దృష్టి సారించిన తర్వాత పత్తి పంట సాగు కూడా జిల్లాలో పెరిగింది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్, అచ్చంపేట డివిజన్ పరిధిలో పత్తి పంట ఎక్కువగా సాగు అవుతున్నది.
పత్తి పంట ద్వారా లాభాలు పొందుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కష్టాలను కొనితెచ్చింది. జిల్లా సాగు అవుతున్న 2,80వేల ఎకరాలకు అవసరమైన స్థాయిలో యూరియా అందించకపోవడంతో పత్తి పంట ఎదుగుదల పూర్తిగా లోపించింది. ప్రస్తుత వ్యవసాయ విధానంలో ఎరువులు కీలక పాత్ర పోషిస్తున్నా యి. ఎరువుల సమతుల్యతలో తేడాలు జరిగితే పంట దిగుబడిలో కూడా తేడాలు వస్తున్నాయి. పత్తి పంట సాగు చేసే రైతులు ఎకరాకు ఐదు నుంచి 7బ్యాగుల వరకు యూరియాను వాడుతారు. కానీ ఈ వానకాలం పంటలో ఎకరాకు కనీసం ఒక బ్యాగు యూరియా కూడా పత్తి పంటకు అందించలేకపోయా రు. దీంతో జిల్లా పరిధిలో సారవంతమైన భూ ములు ఉన్న కావాల్సిన ఎరువుల పోషకాలు సరైన సమయంలో అందక పోవడంతో పత్తి పంట ఎదుగుదల మందగించింది.
ఒక ఫీటు నుంచి రెండు ఫీట్లలోపు పత్తి చెట్టు పెరిగితే గతంలో ఒక పత్తి చెట్టుకు 100 దాకా పత్తి కాయలు వస్తే ఈ సారి మాత్రం పది నుంచి 20లోపు మాత్రమే వున్నాయి. గత పదేండ్లలో ఒక ఎకరా పత్తి పంటలో 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే ఇప్పుడు సగటున ఎకరా పత్తి పంటపై రెండు నాలుగు క్వింటాళ్ల వరకు పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించకపోవడంతోనే పంట దిగుబడి పూర్తిగా పడిపోయే స్థితి దాపురించింది.
ఏ రైతు అయినా ప్రకృతిపై ఆధారపడి పంటలను సాగు చేయడం సహజం, నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రకృతి ద్వారానే వస్తోందని రైతు నమ్ముతాడు. కానీ మొదటి సారి రైతులకు ప్రకృతి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సృష్టించినా సీఎం రేవంత్‌రెడ్డి పురుడు పోసుకున్న నేలకు అన్యాయం చే యడని ఈ ప్రాంత రైతులు భావించారు. సీఎం సొంత ఊరు చుట్టు పక్కల గ్రామాల్లో 17వేల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతున్నట్లు అధికార గణంకాలు చెప్పుతున్నాయి. ఈ ప్రాంతంలో యూరియా కొరత ఉండదన్నాకున్నారు. యూరియా కొరతతోపాటు అధిక వర్షా లు తోడు కావడంతో పంట దిగుబడి మందగించింది. అయితే మొదటి విడుత పత్తి పంట చేతి వచ్చిన విక్రయించలేని స్థితిలో పత్తి రైతు ఉన్నాడు.
జిల్లా పరిధిలో 30 దాకా సీసీఐ పత్తి కొనుగులు కేంద్రాలను ఏర్పాటు చేయాలి, కానీ అధికారికంగా ఏర్పాటు చేస్తామని చెప్పి న 20 సీసీఐ కోనుగోలు కేంద్రాలను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దీంతో పత్తి పంటను ఎక్క డ విక్రయించాలో.. ఎక్కడ దాచుకోవాలో తెలియక దళారులకు క్వింటాకు పత్తి కేవలం రూ.నాలుగు నుంచి ఐదు వేలకు విక్రయించుకుంటున్నారు. ప్రభు త్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా పత్తి రైతులను నిండా ముంచుతోంది. పొడవుగా ఉన్న దూదికి రూ. 8,110, చిన్న సైజులో ఉన్న పత్తికి రూ.7,710 ధర నిర్ణయించారు. 12శాతం కంటే తేమ శాతం తక్కువగా ఉండాలని షరతులు పెట్టారు. తేమ పేరుతో, నాణ్యత పేరుతో పత్తి రై తులను మోసం చేసేందుకు దళారులతోపాటు సంబంధిత మార్కెట్‌శాఖ అధికారులు కూడా చేతులు కలిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూలిగే నక్కపై తాటి కాయ పడినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా పత్తి రైతుల పరిస్థి తి దాపురించింది.
ఇప్పటికే యూరియాతోపాటు సకాలంలో ఎరువులు అందించకపోవడంతో నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తి రైతులకు న్యాయం చేయాలని రైతు సం ఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీని పై జిల్లా వ్యవసాయ అధికారిని వివరణ కోరగా మొదటి విడుత పత్తి పంట చేతికి వస్తోంది. ఇంకా రెండు నుంచి మూడు దశలల్లో పత్తి పంట వచ్చినప్పుడు దిగుబడి గురించి తెలుస్తోంది. 20 సీసీఐ కోనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది పత్తి పంట ఎదుగుదల కొంత మేరకు మందగించింది. పత్తి రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.