Collector Adarsh Surabhi | అమరచింత : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పాటిస్తూ లాభసాటి పంటలను సాగు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ ఆత్మకూర్ అమరచింత మండలాలను సందర్శించిన అనంతరం అమరచింత మండలంలోని నాగల్ కడుమూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయన్నారు.
ప్రతీ సంవత్సరం భూమిలో వరి పంటను వేయడం వల్ల సారవంతం తగ్గి పంట కూడా తగ్గిపోతుందని.. అలా కాకుండా ప్రజలు నిత్యం వాడే ఆయిల్ మన దేశంలో దొరకడం లేదని ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామని.. రైతులు ఆ దిశగా ఆలోచించి లాభసాటి పంటలైన ఆయిల్ ఫామ్, వేరుశెనగ తదితర పంటలని సాగు చేయాలన్నారు. అందుకోసం ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వం నుంచి 80% సబ్సిడీ కూడా అందజేస్తుందని సూచించారు.
వనపర్తి జిల్లాలో 2021 నుంచి మొదలైన ఆయిల్ పామ్ సాగు నేడు 5000 ఎకరాలకుపైగా సాగు చేయబడుతుందని అందులో అమరచింత మండలంలో 416 ఎకరాలను ఇప్పటికే రైతులు సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని బాలకృష్ణపూర్లో రైతు సాగు చేస్తున్న ఆయిల్ఫామ్ సాగు పంటను కలెక్టర్ పరిశీలించి రైతులను అభినందించారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కువ పెద్ద రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని చిన్న, సన్నకారు రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి నీటి పొదుపుతోపాటు వ్యవసాయంలో మార్పులను చేసినట్టుగా అవుతుందని రైతులకు కలెక్టర్ సూచించారు.
ఆయిల్ పామ్ సాగుపై సూచనలు..
అంతకుముందు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దామోదర్, హార్టికల్చర్ అధికారి అక్బర్ ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ రైతు నేస్తం కార్యక్రమానికి మండల వ్యవసాయ శాఖ అధికారి అరవింద్ అధ్యక్షత వహించగా.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు హరిత, మల్లేష్ శివ తదితరులు ఉన్నారు. అనంతరం గ్రామంలో మరమ్మతులు చేపట్టిన పాఠశాల భవనమును ప్రారంభించారు.
అలాగే వ్యవసాయ భూములు ఒకరి పేరు మీద ఉంటే సర్వేలో మరొకరు చూయిస్తుందని రైతులు అయోమయంలో పడి ఒకరిపై ఒకరు గొడవలు చేసుకునే పరిస్థితి దాపురించిందని.. దీనిపై కలెక్టర్ స్పందించి అధికారులతో సర్వే చేసి రైతులకు హద్దులను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి. జగన్ రెడ్డి. మహిముద్. మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?