గద్వాల, మార్చి 24 : సాగునీరు అం దక పంటలు ఎండుతున్నాయి.. తమ పంటలకు సాగునీరు విడుదల చేసి కా పాడాలంటూ అలంపూర్ తాలూకా రైతులు డిమాండ్ చేశారు. సోమవారం అయిజ మండల పరిధిలోని పులికల్, రాజపూర్, మేడికొండ, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్లి, చిన్నతాండ్రపాడు, కిసాన్‌నగర్, కుట్కనూర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు వందమంది రై తులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు నర్సింహులు, సుధాకర్‌గౌడ్, వెంకటేశ్, హు స్సేన్, నాగిరెడ్డి తదితరులు మాట్లాడు తూ సింధనూర్ డీ-12ఏ పరిధి నుంచి ఉప్పల వరకు రైతులు సుమారు 22 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు చెప్పారు.
అయితే ప్రస్తుతం పంట చివరి దశలో ఉందని ఈ సమయంలో ఆర్డీఎస్ కాల్వకు వచ్చే నీరు నిలిచి పోయిందని, దీంతో ప్రస్తుతం నీరు లేక పోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఆర్డీఎస్ కాల్వకు నీటిని విడుదల చేయకపోతే మొత్తం 22వేల ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయే అవకాశం ఉందని, అదే జరిగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పదిరోజుల దాకా రోజు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని తుంగభద్రానది నుంచి విడుదల చేస్తే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉందన్నారు.
ఆ దిశగా రైతుల సం క్షేమా న్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నీటి ని విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. కర్ణాటక ప్రభుత్వం ఏప్రిల్ మొదటి వారంలో నీటిని విడుదల చేస్తామని చెబుతుందని అప్పుడు నీటిని విడుదల చేస్తే ఎవరికి ఉపయోగం అన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయిస్తే పంటలు కాపాడిన వారవుతారని చెప్పా రు. కొంత మంది ప్రజాప్రతినిధులు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సాగునీటిని విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారని ఇప్పు డు వాళ్లు ఎక్కడున్నారని, నీళ్లు ఏడున్నాయని ప్రశ్నించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం రైతులకు రైతు భరోసా ఎలాగో ఇవ్వడం లేదని కనీసం సాగు నీరు అందించి పంటలను కాపాడాలని వారు కోరారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు వచ్చిన పట్టణ ఎస్సై రైతులను కలెక్టర్ వద్దకు తీసుకుపోయి మా ట్లాడించారు. పది రోజుల పాటు సాగు నీరు ఇస్తే తమ పంటలు చేతికి వస్తాయని మా బాధను అర్థం చేసుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అం దజేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్వీ నాయకుడు కుర్వ పల్లయ్య, సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సీపీఐ నాయకులు ఆంజనేయు లు, ప్రజా సంఘాల నాయకులు ప్రభాకర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రైతు లు ప్రాణేశ్, రామలింగప్ప, దేవేందర్‌రెడ్డి, భీమన్న, జనార్దన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.