అన్ని మండలాల్లో యూరియా కోసం ధర్నాలు జరుగుతున్నాయి.. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వా నికి రైతుల ధర్నాలు, ఇబ్బందులు కనిపించడం లే దా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. రైతు ల ధర్నాలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదు. ప్రతిపక్షం డ్రామా అని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రతిపక్ష పార్టీ మీద రుద్దుతున్నారని విమర్శించారు.
మీకు పరిపాలన చేయడం రావట్లేదు.. పదిహేను రోజుల నుంచి రైతులు తిరిగి పోతున్నా రు.. యూరియా ఇవ్వకపోగా రైతులను బద్నాం చేస్తున్నారని విమర్శించారు. ఇంత దౌర్భాగ్య ంగా ప్రభుత్వాన్ని నడపడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేదని రైతులు చెప్తున్నారు. మళ్లీ ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చామని రైతులు అంటున్నారు. ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు. వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతుంది.
పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందనీ ఆ ందోళన వ్యక్తం చేశారు. దీనికి పూర్తిగా ప్రభుత్వం బా ధ్యత వహించాలి. సీఎం సొంత జిల్లాలో రైతులకు ఇ బ్బంది ఉండదు అనుకున్నాం..కానీ అందుకు భిన్నం గా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసుకుంటూ ప్రతిపక్షం కుట్ర అని మంత్రులు చెప్తున్నారు..దమ్ముంటే కేంద్రా ల వద్దకు రావాలని డిమాండ్ చేశారు. పరిపాలన మీ కు చేతనైతే యూరియా తెప్పించి రైతుల ఇబ్బందులు తీర్చాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నా రు.