కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన
జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను రేవంత్‌రెడ్డి సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద వరి కొయ్యలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
గద్వాల, ఏప్రిల్ 24 : జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను రేవంత్‌రెడ్డి సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద వరి కొయ్యలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డివెంకట్రాములు, కురువపల్లయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారు మాట్లాడారు. ఈనెల 22వ తేదీన జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు అయిజ, రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందన్నారు. వానకు గింజలు రాలిపోయాయన్నారు.
వడగండ్ల వాన, ఈదురు గాలులకు అయిజ, రా జోళి, వడ్డేపల్లి మండలంలోని ఉప్పల, చిన్నతాండ్రపాడ్, నౌరోజీ క్యాంప్, నసనూర్, మాన్‌దొడ్డి, పులికల్, రాజాపురం, కొత్తపల్లి తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటకు తీవ్రనష్టం జరిగిందన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2వేల ఎకరాల్లో పంట పూర్తిగా పాడైపోయిందన్నారు. ఎకరాకు 30 బస్తాలు పండే వరి ధాన్యం చేతికి వచ్చే సమయంలో నేలపాలై రైతులు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే వారికి ఆత్మహ్యతలే శరణ్యమన్నారు. గత వానకాలంలో అధిక వర్షాలతో నష్టపోయారని, ప్రస్తుత యాసంగిలో పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం కురువడంతో పం ట నష్టపోయి రైతులు అప్పుల పాలయ్యారన్నా రు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారికి వెంట నే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చే శారు. అనంతరం కలెక్టరేట్ ఏవో భూపాల్‌రెడ్డికి రైతులతో కలిసి వినతిప్రతం అందజేశారు. నిరసన కార్యక్రమంలో రైతులు రవికుమార్‌రెడ్డి, కృష్ణయాదవ్, వీరేశ్, తిమ్మప్ప, వి నయ్, వినోద్, లింగప్ప, రాజు, జమ్మన్న, భీ మన్న, రామకృష్ణ, సురేశ్, భీముడు, పరశురాముడు, శివరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

