నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 24 : నాగర్‌కర్నూ ల్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు మరోసారి రోడ్డెక్కారు. కొనుగోలు నిలిచిపోవడంతో మార్కె ట్ మొత్తం మొక్కజొన్న ధాన్యంతో నిండిపోయింది. రెండు వారాలు కావస్తున్నా కనీసం గన్నీ బ్యాగులను సైతం రైతులకు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తూ రోడ్డుపై ఆరబెట్టడం, కుప్పవేయడమే తమకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం కూడా కొందరు గన్నీ బ్యాగులు లేకపోవడం, కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెల్లికొండ చౌరస్తాలో ధర్నాకు పూనుకున్నారు. దీంతో అచ్చంపేట, శ్రీశైలం, కొల్లాపూర్‌తోపాటు ఇటు మహబూబ్‌నగర్, హైదరాబాద్, వనపర్తి ప్రాంతాలకు వెళ్లే వా హనాలు భారీగా నిలిచిపోయాయి. ఇదేసమయంలో కలెక్టరేట్లో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు ఆదారిలో వెళ్తున్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్టలను మొక్కజొన్న రైతులు అడ్డుకొని నిలదీశారు. రెండు వారాలుగా త మగోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం తరలించడం లేదన్నారు.
మార్కెట్లో రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఏనాడుకూడా రైతుల గురించి పట్టించుకోవడం లేదని, మార్కెట్లోకి రావడం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. కనీసం గన్నీ బ్యాగులు కూడా సరిపడా ప్రభు త్వం సరఫరా చేయలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నిలదీయడంతో ఏం చేయాలో తోచని ఎమ్మెల్యే ఈ సాయంత్రం వరకు గన్నీ బ్యాగులు వస్తాయంటూ అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లిపోయారు.
ధర్నా చేస్తున్న మహిళా రైతులు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. దళారు లు, వ్యాపారులకు గన్నీ బ్యాగులు ఇస్తూ రైతులకు మాత్రం ఈరోజు, రేపు అంటూ కా లయాపన చేస్తున్నారన్నారు. ఫ్రీ బస్సు పెట్టే బదులు రైతులకు సాయం చేయవచ్చుకదా అంటూ సలహా ఇచ్చారు. రేవంత్‌రెడ్డి వచ్చి చేసిందేముందయ్యా అందరినీ ముంచి కూ సున్నడు అంటూ మండిపడ్డారు.
ఎన్నో ఇ బ్బందులు పడి పంటలు పండించి ధాన్యా న్ని మార్కెట్ తెస్తే మద్దతు ధర ఇచ్చి రైతుల ను ఆదుకునేదిపోయి కొనుగోలు చేయకుం డా, బస్తాలు ఇవ్వకుండా చేస్తున్నారని, వర్షం వస్తే తమ ధాన్యం పూర్తిగా తడిసిపోయే ప్ర మాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా ఆకాశంలో మోడం వేసుకున్నదని మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని తిండి తిప్పలు లేకుండా కాపలా ఉంటున్నామన్నారు. కొనుగోలు చేసే విషయంలో కొత్త కొత్త రూల్స్ పెట్టి ప్రభు త్వం రైతులను మోసం చేస్తుందని, ఆశ అనే స్కీం పెట్టి కొనుగోలు చేస్తున్నామంటే తాము మార్కెట్‌కు ధాన్యం తెచ్చామని, కానీ దళారులకే అమ్ముకోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.
కొందరి రైతులకు ధాన్యం మార్కెట్ తెచ్చి మూడురోజుల తర్వాత సంచులు ఇ చ్చారని, సంచులకు నింపి కూడా తొమ్మిది రోజులవుతుందని, అయినా కొనుగోలు చే యడం లేదని మహిళా రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజు మార్కెట్ వచ్చి పో తూ మక్కలకు కాపలా కాయాల్సి వస్తుందని మండిపడుతున్నారు. మక్కలు కొనుగోలు చేసేందుకు ఇంటి వద్దకు పంపిస్తామన్న చెప్పి న ప్రభుత్వం, మార్కెట్ మక్కలను తెచ్చినా కొనుగోలు చేయకపోవడం అంటే రైతులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందని పలువురు రైతులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఏదేమైనా మార్కెట్‌కు తెచ్చి న ధాన్యాన్ని తెచ్చినట్లుగా కొనుగోలు చేయా ల్సి అవసరం ఉందని, అకాల వర్షాలకు కాం టా చేసిన ధాన్యం సైతం తడిసిపోయే ప్రమా దం ఉందని, ఎప్పటికప్పుడు తరలించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు తీరు మార్చుకోకుంటే.. తడాఖా చూపుతాం.