మాగనూరు, మే 1: మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల్లో రైస్ మిల్లులకు వరి ధాన్యం రెండు నుంచి 5వేల క్వింటాళ్ల వరకు తీసుకోవాలని అ ధికారులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు.. అసలు రైతుల దగ్గర వరి ధాన్యం కొనాలనుకుంటున్నారా లేదా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్వాట్ గేట్ సమీపంలోని వైష్ణవి రైస్‌మిల్ దగ్గర రైతులు మూడు రోజులుగా సొంత వాహనాలు, కిరాయి వా హనాలతో పడిగాపులు కాసినా రైతులు వడ్లు కొనుగోలు చేసే సమయానికి మిల్లు క్వాంటిటీ అయిపోయిందని చెప్పారు.
అంతేకాకుండా కొంతమంది రై తుల దగ్గర ప్రభుత్వానికి విరుద్ధంగా మూడు కిలోల తరుగు తీసుకుంటాం.. అట్లయితే వడ్లు కొంటాం లేకపోతే మిగతా రైతులు వేరే రైస్ మిల్లు దగ్గర వెళ్లి వడ్లు అమ్ముకోవాలని అనడంతో అప్పటికే విసుగు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం వడ్వాట్ గేటు సమీపంలోని ఎన్‌హెచ్ 167పై గంటపాటు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రై తులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనాలంటే రైతు లు నష్టపోవాలా నష్టపోతేనే వరి ధాన్యం అమ్ముకోవాలంటే రైతులకు అధికారులు ఏం న్యాయం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. మిల్లుల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో మిల్లుల య జమానుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మం డిపడ్డారు. రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ, ఎస్సైలు అక్కడికి చేరుకొని రైతులను బెదిరించేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. దీంతో వ్యవసాయాధికారులను పిలిపించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయధికారి సుదర్శన్‌గౌడ్ జిల్లా అధికారులతో మాట్లాడా రు. వైష్ణవి రైస్ మిల్ యజమానితో ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అప్పటికప్పుడు ప్రస్తుతానికి 3వేల బస్తాలు తీసుకోవాలని రైస్‌మిల్ యజమానిని ఒప్పించడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, జనసేన, బీజే పీ నాయకులు, వివిధ గ్రామాల రైతులున్నారు.