కొల్లాపూర్ రూరల్, జూన్ 19 : కాంగ్రెస్ ప్ర భుత్వంలో రైతుభరోసా సాయం అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువా రం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన మ హిళా రైతు చేతమోని నాగమ్మ మండల కేం ద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి వచ్చిం ది. తన భూమి పాస్ బుక్కు తీసుకొచ్చి ఏవో చిన్న హుస్సేన్ యాదవ్ వద్దకు వెళ్లి పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వడం లే దని నిలదీసింది. రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది.
కేసీఆర్ హయాంలో ఏడాదికి రెండు సార్లు రైతుబంధు సకాలంలో అందేదని, కాంగ్రెస్ వచ్చాక ఒక్కసారి కూడా పడలేదని వాపోయింది. అలాగే ఎన్మన్‌బెట్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు సైతం కార్యాలయానికి వెళ్లి రైతు భరోసా గురించి ఏఈవో, ఏవోతో ఆరా తీశారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ప్రభుత్వమే డబ్బులు వేయలేదని.. దీనికి తాము కారణం కాదని సర్దిచెప్పారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.