లింగాల, నవంబర్ 17 : కష్టనష్టాలను ఓ ర్చుకొని అరకొరగా చేతికొచ్చిన పంటలను అ మ్ముకుందామంటే దళారులు నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడమే తప్పా ఆచరణలో కొనుగోళ్లు ఎక్కడా లేకపోవడం తో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్తాకు రెం డున్నర కిలోలు, క్వింటాకు 5కిలోల వరకు అధికంగా తూకం చేస్తుండడంతో రైతులు గ త్యంతరం లేక అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు.
దళారుల దందా తెలిసినా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండడంతో మొ క్కజొన్న రైతులు ఆగమవుతున్నారు. లింగా ల మండలంలో 13వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేయగా, క్వింటాకు రూ. 1,800 నుంచి రూ.2,400 వరకు ఉండగా, తూకాల్లో తేడాలు, 6 కిలోల తరుగు, రూ. వెయ్యికి రూ.3 కమీషన్, హమాలీ రూ.22, బస్తాకు వాహన ఖర్చు రూ.15గా మొత్తంగా క్వింటాకు దాదాపు రూ.200 వరకు నష్టపోవాల్సి వస్తున్నది.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా మండల కేంద్రంలో సబ్మార్కెట్ యార్డు ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్ర యోజనం చేకూరడం లేదు. ధాన్యం అమ్ముకోవాలంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్చంపేటకు తీసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయ మార్కెట్ కమిటీలో మండలానికి ఒకరు డైరెక్టర్గా ప్రాతినిథ్యం వ హిస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని రైతు లు విమర్శిస్తున్నారు.
నిబంధనల ప్రకారం బస్తాకు ఒక కిలో మాత్రమే తరుగు, తేమశా తం 17శాతం మించకుండా తాలు, మట్టిపెళ్లలు చెత్తాచెదారం, నాణ్యత దృష్టిలో పెట్టుకొ ని తూకం వేయాల్సి ఉంటుంది. గోనెసంచి బరువు (600గ్రా)తో కలిపి బస్తాకు 50.6కిలోల తూకం వేయాల్సి ఉంటుంది. కానీ బ స్తాకు మూడు కిలోల వరకు తరుగు తీయడంతోపాటు తూకాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోళ్లలో మో సాలను అరికట్టడంతోపాటు మండల కేం ద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ఉపశమనం కలుగుతుందని రైతు లు కోరుతున్నారు.
స్థానికంగా వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు ఉన్నప్పటికీ వాడుకలో లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఇక్కడ దాదాపు ఎ క్కువ శాతం మంది మొక్కజొన్న పంటను సాగు చేస్తాం. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే రైతులను నిండా ముం చుతున్నారు. సర్కారోళ్లు కొనకపోవడంతో గత్యంతరం లేక నష్టమైనా బయట వ్యాపారులకు అమ్ముకోక తప్పడం లేదు.
– కాట్రావత్ రాంజీనాయక్, రైతు, లింగాల
మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ సబ్ మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. దళారుల చేతుల్లో మోసపోతున్న రైతుల దుస్థితిని వ్యవసాయశాఖ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వానికి పన్ను రూపంలో వ్యాపారులు చెల్లించాల్సిన సుంకాన్ని రాబట్టేందుకు కమిటీ చర్యలు తీసుకుంటున్నది.
– ముక్తార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్