నాగర్కర్నూల్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రైతుకు భరోసా ఇచ్చే చేయి కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లలో పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అమలు చేసిన రైతుబంధు పథకం పేరు మారిందే తప్పా ఆచరణలో చేయూతను అందించడం లేదు. ప్రస్తుతం వానకాలం పంట సీజన్ కూడా ముగుస్తోంది. యాసంగి దగ్గరికి వచ్చింది. దీంతో ఈ సీజన్లోనైనా రైతు భరోసా అందుతుందా అనే సందేహం రైతుల్లో నెలకొంది.
రైతులకు పెట్టుబడుల సాయం ఎండమావిగా మా రింది. సమైక్య పాలనలో వ్యవసాయం దండగలా మా రితే బీఆర్ఎస్ హయాంలో తొలి సీఎం కేసీఆర్ నాయకత్వం పండుగలా మార్చింది. రైతులకు 24గంటల ఉచి త విద్యుత్, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, రైతులకు రూ. లక్షలోపు రుణమాఫీ, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరలాంటి ఎన్నో చర్యలతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతను అందించింది. ఈ క్రమంలో పది నెలల కిందట పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అటకెక్కిచింది.
ఎన్నికల హామీల్లో ఎకరాకు రూ.7,500చొప్పున రెండు పంటలకు ఏడాదిలో రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్ర భుత్వం ఎకరాకు రూ.5వేలు అందించింది. దీంతో కాం గ్రెస్ హామీలను నమ్మిన రైతులు అధికారం కట్టబెట్టగా రైతు భరోసా పథకం అమలవుతుందని భావించారు. అయితే గతేడాది యాసంగి సీజన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదని పేర్కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ రూపొందించిన రైతుబంధు పథకం మాదిరి ఎకరాకు రూ.5వేల చొప్పున అందించింది.
ఆ తర్వాత ఈ వానకాలం ఆరంభంలో రైతుభరోసా అమలవుతుందని ఆశించిన రైతన్నలకు భంగపాటే మిగిలింది. రుణమాఫీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా పూర్తి స్థాయిలో అందించలేక విఫలమైంది. ఇప్పటికీ వేలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందలేదు. రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు ప్రకటనలు చేస్తున్నా పరిస్థితి వాస్తవానికి వి రుద్ధంగా ఉన్నది. ప్రస్తుతం వానకాలం పంటల సమ యం కూడా దాదాపుగా ముగుస్తోంది. వచ్చే అక్టోబర్ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఈ సీజన్లోనైనా రైతు భరోసా పథకం అమలవుతుందా? అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ వానకాలంలో రైతు భరోసా పథకం అమలు కాకపోవడంతో రైతులు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతు లు పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు వ చ్చాయి. తీరా ఈసారి కురిసిన అతివర్షాలతో పత్తి పంట బాగా దెబ్బతింది. నాగర్కర్నూల్ జిల్లాలో దాదాపుగా 15 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. దీనివల్ల రై తులు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు దెబ్బతిన్న పంటలకు పరిహారం సైతం అం దలేదు. ఈ క్రమంలో యాసంగి సీజన్లో పంటల సా గు రైతన్నల్లో పెట్టుబడుల భయాన్ని కలిగిస్తోంది.
వానకాలంలో పెట్టుబడులకు చేసిన అప్పులు, దెబ్బతిన్న పంటలతో కలిగిన నష్టం ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రె స్ ప్రభుత్వం రైతుభరోసా పథకంపై విధివిధానాలను ప్రకటిస్తామని పది నెలలుగా నెట్టుకొస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితబంధు, పల్లె ప్రగతి, మనఊరు-మనబడి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, న్యూట్రీషియన్ కిట్, డబుల్ బెడ్రూం ఇండ్లు, గొర్రెల పంపిణీ, అ ల్పాహారం లాంటి ఎన్నో పథకాలు కనుమరుగయ్యా యి. ఈ నేపథ్యంలో రైతుల కోసం 2018 నుంచి అమలైన రైతుబంధు పథకం వల్ల జిల్లాలో రూ.3.981 కోట్లు నేరుగా రైతులకు లబ్ధి కలిగించాయి. కాగా రైతుభరోసాగా పేరు మారిన కూడా అమలయ్యేనా అనే సందేహా లు రైతన్నల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.