వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
సింగవట్నం రత్నగిరికొండపై నుంచి ఎటు చూసినా కనుచూపు మేరలో పచ్చని పైర్లతో కళకళలాడిన వరి పైరు, ప్రస్తుతం కోత దశకు రావడంతో పసిడివర్ణంలో కనిపిస్తున్నది.
– కొల్లాపూర్, మే 8