అమీన్పూర్(జిన్నారం); ఫిబ్రవరి 25 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్కిల్ పరిధిలోని 993, 994 సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూముల్లో కొన్ని రోజులుగా చేపడుతున్న నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మా ట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
బొల్లారం, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ భూము ల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినా, కబ్జాలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని టీపీబీవో రోహాన్ ఠాకూర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 284, 243లో అక్రమ నిర్మాణాలను బుధవారం జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సరిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు..
జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు గు ర్తించి కూల్చివేశారు. ఖాళీ గా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఇదివరకే కబ్జాలకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీవో పవన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ నర్సింహులు, ఎస్సై కృష్ణారెడ్డి, సిబ్బంది నవీన్, అలీ పాల్గొన్నారు.