హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అక్రమాలకు పాల్పడి, ఫలితాలను తారుమారు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రామగుండం కార్పొరేషన్లో ఎన్నికలు జరిగిన తీరుపై సమగ్ర విచారణ జరపడంతోపాటు అక్రమాలకు పాల్పడినవారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.