10హెచ్‌పీ మోటర్లంటే రైతుకు భారమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 10హెచ్‌పీ మోటర్ల వ్యవహారంపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే రైతులకు మోయలేని భారం అవుతుంది. రూ.లక్షపైగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పైప్‌లైన్ మొత్తం కూడా మార్చుకోవాల్సి వస్తుంది. వారు ఇచ్చే మూడు గంటల కరెంట్‌కు 10 మోటర్లు అందరూ ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు అన్ని కాలిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 24 గంటల కరెంట్‌తోనే రైతులు 3హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు పొలాలకు వెళ్లి నీరు పారబెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చి మూడు గంటలు ఇస్తే పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చి రేయింబవళ్లు కరెంట్ కోసం పడిగాపులు గాసే రోజులే వస్తాయి. అందరికీ 24 గంటల కరెంటే ఆమోదం.
ఇన్నాళ్ళు వ్యవసాయం అంటనే దండగ అన్నట్లు ఉండేది. కానీ సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి ఎంతో మంచి జరిగింది. అందుకే ఎంతో మంది పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు నిరంతరం కరెంటు ఇస్తూ దేశానికికే రోల్‌మాడల్‌గా నిలుస్తుంది. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు బుడ్డ చెనుకూ నీళ్లు పారబట్టెకుంటున్నాను. అదే గతంలో పంటకు నీళ్లు పారించాలంటే కరెంటు కోసం కాపల కాయాల్సి వచ్చేది. కాంగ్రెస్ పార్టీలో ఒకడు 3 గంటల కరెంటే సరిపోతుందిఅంటడు, మరోకడు 10 హెచ్ మోటర్లు పెట్టుకోవాలంటడు. వారికి వ్యవసాయంపై అవగాహన లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు 5 హెచ్‌పీ మోటర్లకే పరిపడే విధంగా ఉంది. 10 హెపీ అంటే అంతా అస్తవ్యవస్తం అవుతుంది. వ్యవసాయం మళ్ళీ దండగ అనే పరిస్థితి వస్తుంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై ఏమంటే అది మాట్లాడుతున్నడు. రైతులకు మూడు గంటల కరెంట్ సాలని, అందరూ 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే సిపోతదని అంటున్నారు. మూడు గంటల కరెంట్‌తో మూడు మడులు కూడా పారవు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం మానుకొని మళ్లీ కూలి పనులకు వెళ్లాల్సి వస్తుంది. అదే ఆయన కోరుకుంటున్నట్లుండు. వ్యవసాయం తెలిసిన వాడు అధికారంలోకి ఉంటే రైతుకు మేలు జరుగుతుంది. అందుకే సీఎం కేసీఆర్ రైతుల బాధలు తెలుసుకొని వారికి 24 గంటలు కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నాడు. దీంతో రైతులు రాత్రిళ్లు పొలాల వద్దకు వెళ్లకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ మొదటి వచ్చి రేయింబవళ్లు పొలాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆ రేవంత్ రెడ్డి అసలే వద్దు. మళ్లీ కేసీఆర్ సారే సీఎం కావాలి.
కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలను ఎవరూ పట్టించుకోలేదు. రైతు ఆదుకునేందుకు సాయం చేయలేదు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా 24 గంటలపాటు కరెంట్ ఇచ్చి రైతుల కష్టాలను కడతేర్చారు. గతంలో కరెంట్ కోసం పడిగాపులు కాసేది. ఈ రోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏటా రెండు పంటలు పండించుకుంటున్నా ఒక్క నాడు కరెంట్ కోసం పొలాల వద్ద పండింది లేదు. ఆ బాధలైతే పూర్తిగా పోయినయ్.. గిప్పుడు కాంగ్రెసోళ్లు మూడు గంటలు అని మాట్లాడుతున్నారు. వారికి వ్యవసాయం గురించి ఏమైనా అవగాహన ఉన్నదా. ఏది పడితే అది మాట్లాడి రైతులను ఆరిపోసుకుంటున్నారు. రైతులు మంచిగ ఉంటేనే కదా నాలుగు మెతుకులు నోట్లోకి పోయేవి. రైతును ఆగం చేస్తే ఏం వస్తది వారికి. 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్లు ఇక్కడ సరిపోవు. అందరికీ 24 గంటల కరెంట్ కావాలి, 3హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు కావాలి. అందుకే రైతు కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ సారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మూడు గంటల కరెంట్‌తో మళ్లీ పంటలు ఎండిపోయి రైతులను ఆగం చేయడం తప్పా మరొకటి లేదు. అదే విధంగా 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతున్నారు. రూ.లక్షకు పైగా ఖర్చుపెట్టి మోటర్లు కొనగడం మాలాంటి రైతులకు భారమే. ఆ మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోవడం ఖాయం, మళ్లీ వారిచ్చే మూడు గంటల కరెంట్ కోసం రేయింబవళ్లు పొలాల వద్ద కాపాలాగాసే పరిస్థితి ఉంటుంది. కరెంట్‌తోనే రైతులు చనిపోవడం లాంటి ఘటనలు పునరావృత్తం అవ్వడం ఖాయం. అందుకే 24 గంటలు విద్యుత్ ఇచ్చే సీఎం కేసీఆర్ సార్నే మళ్లీ గెలిపించుకోవాలి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కాళరాత్రులే అవుతాయి. మరల పాతరోజులే వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు నష్టం కలిగించే పనులు చేపట్టింది. ఇప్పుడు అదే చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండని అంటున్నారు. రైతులకు 24గంటల కరెంటు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, కేసీఆర్ పాలనలో రైతులకు 24గంటల కరెంటు, రైతులు విత్తనాలు, ఎరువులకు ఇతరులపై ఆధారపడుకూడదని రైతుబంధు, రైతు మరణిస్తే రైతుకుంటుంబం రోడ్డుపాలు కాకూడదనే రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటున్నారు. రైతుల బతుకులు బాగుండడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టంలేదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3గంటల కరంట్తోనే 10హెచ్‌పీ మోటార్లతో పొలానికి నీటిని పారించవచ్చని రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ పార్టీ మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుంది. గతంలో కరెంటు కోసం తెల్లవారులు జాగరణ చేసేవాళ్లం. 24 గంటలు కరెంట్ ఉండడంతో ఏడాదిలో రెండు పంటలు వేసుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తే ఒక్క పంట కూడా పండించుకోవడం కష్టంగా మారుతుంది.
సాగుకు మూడు గంటల కరెంట్‌తో ఒక్కమడి కూడా పారదు. కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లడితే నడువదు. వాళ్ల పాలన ఎట్లుంటదో మా రైతులకు తెలుసు. వాళ్ల పాలనలో బతుకుడు ఉండదు సచ్చుడే. ఆరిగోస పెడుతారు. ఒకప్పుడు కరెంట్ ఇయ్యక ఎంత నరకం చూపెట్టిండ్రో ఇంకా మరిచిపోలే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక మా మొఖాలు తెల్లగవుతున్నయ్.. 24 గంటల కరెంట్‌తో రెండు పంటలు మంచిగా పండించుకుంటున్నం. మూడు గంటలు అంటే అందరూ వ్యవసాయం బంధుపెట్టుకొని మళ్లీ వలసలు పోవడం ఖాయం. అందుకే బీఆర్ఎస్కే మద్దతివ్వాలి. 24 గంటల కరెంట్‌ను తీసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం పుణ్యాన రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ అందించడంతో ఏటా రెండు పంటలు పండించుకుంటున్నాము. రైతుల కష్టం తెలిసిన వాడు సీఎం కేసీఆర్. రైతులకు ఎప్పుడు ఏమేమి అవసరమో సకాలంలో అందిస్తుడండంతో చింతలేకుండా పంటలు పండించుకుంటున్నాము. పందేండ్ల కిందట ఎవుసం అస్తవ్యస్తంగా ఉండేది. వానకాలం కూడా లోఓల్టేజీ కరెంట్‌తో పంటలు పండేవి కావు. ఉన్న పొలంలో కొద్దిపాటి వరి పంట వెసుకొని యాసింగిలో పొలం బీడుగా ఉండేది. దీంతో రైతులకు ఒక్కపంట సాగుతో రైతులకు ఏమి మిగులుబాటు లేకుండే. ఇప్పుడు వానకాలం వరిసాగు, యాసంగిలో పల్లీ పంటలు సాగు చేసుకొని రెండు పూటలా భోజనం చేస్తున్నాం. ఇప్పుడు కొందరు ఎద్దు ఎవుసం తెలియని కాంగ్రెస్ నాయకులు రైతులకు 3 గంటల కరెంట్ చాలని, 10 మీటర్లు పెట్టుకోవాలని మాట్లాడడం అవివేకం. అన్ని తెలిసిన వాడు సీఎం కేసీఆర్ అందుకే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. రైతులంతా కేసీఆర్ వెంటే ఉంటారు.