రాజోళి, జనవరి 24 : రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మండలంలోని వివిధ గ్రామాల్లోని పంట భూములు నాశనమవుతాయని ఆవేదన వ్య క్తం చేశారు.
అంతేకాకుండా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా తుంగభద్ర నదితోపా టు పరిసర గ్రామాల్లో తాగునీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభు త్వం వెంటనే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖులు రామచంద్రారెడ్డి, సం జీవరెడ్డి, శశికుమార్, అంజి, అడివిస్వామితోపాటు పలువురు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో పెద్ద ధన్వాడతోపాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.