హన్వాడ, సెప్టెంబర్ 17 : యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయడం లేదు, టోకెన్లు ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా యూరియా ఇవ్వడం లేదని వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం చించోళి, మహబూబ్నగర్ ప్రధాన రహదరిపై మూడు గంటల సేపు రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పంటకు యూరియా సకాలంలో వేయకపోవడంతో పంట దిగుబడి రాదు అందుకు ప్రభుత్వం ఎకరాకు రూ 40వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని, యూరియా వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వేళ్లేదిలేదని రోడ్డుపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్సైకి నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం వరకు యూరియా వస్తదని చెప్పడంతో ఆందోళన విరమించారు. భారీ సంఖ్యలో వాహనాలు ఆగడంతో ప్రయాణికులు, ప్రజలు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.