యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో చోట అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. గు రువారం కూడా యూరియా అందక అన్నదాతలు కన్నెర్ర చేశా రు. మహబూబ్‌నగర్ జిల్లా కోటకదిర, అప్పాయిపల్లి, జడ్చర్ల, వనపర్తి జిల్లా గోపాల్పేట, అమరచింతలో కడుపుమండిన కర్షకులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్-రాయిచూర్ రోడ్డుపై ముళ్లకంప, కట్టెలు అడ్డంగా వేసి రాస్తారోకో నిర్వహించారు. అమరచింత రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద ఆందోళనలో పాల్గొన్న కొం దరు రైతులు అక్కడికి టిఫిన్ బాక్స్‌లలో తెచ్చుకున్న భోజనం చేశా రు. గోపాల్‌పేటలో రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. పంటల అదును దాటుతున్నదని, అయినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. వెంటనే సరిపడా యూ రియా అందజేయాలని డిమాండ్ చేశారు.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 18
జడ్చర్ల, సెప్టెంబర్ 18 : ‘నెల రోజులు గడుస్తున్నది.. ఒక్క బస్తా యూరియా కోసం ఎన్నాళ్లని కార్యాలయాల చుట్టూ తిరగాలే.. పొలం పనులు.. కూలీనాలి చేసుకొని బతికేటోళ్లం. పనులు మానుకొని రాత్రింబవళ్లు యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నాం. కాంగ్రెసోళ్లు జూటా మాటలు చెప్పడం తప్పా రైతుల కష్టాలు తీర్చేటోళ్లు కారని ఇప్పుడిప్పుడే అర్థమైతాంది.. పదేండ్లు కేసీఆర్ సారు పాలనలో ఏనాడూ ఇంత గోస పడలేదు’ అంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని జడ్చర్ల-నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజూ జడ్చర్లకు రావడం.. యూరియా లేక ఇంటికి వెళ్లడం ఇదే దినచర్యగా మారిపోయిందని వాపోయారు. వ్యవసాయ పనులు మానుకొని.. పొలం వద్ద పశువులను వదిలేసి.. కూలీ ప నులు చేసుకోకుండా యూరియా కోసం రా త్రింబవళ్లు పంపిణీ కేంద్రాల వద్ద పస్తులతో పడిగాపులు కాస్తున్నామని బాధను వెళ్లగక్కారు.
యూరియా కోసం ఇక్కడకు వస్తే ఏ దుకాణంలో ఇస్తారో కూడా తెలియక పట్టణంలోని అన్ని ఎరువులు దుకాణాల తిరుగుతున్నామని చెప్పారు. ఇన్నాళ్లు ఎంతో ఓపిక పట్టామని.. ఇక యూరియా ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని రైతులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారి గోపినాథ్, ఎస్సై మల్లేశ్ రైతులతో మాట్లాడి వారిని రోడ్డుపై నుంచి తీసుకెళ్లారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, యూరియా లేక పంట దిగుబడి రాక అప్పులపాలవడం ఖాయమని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గతంలో ఎన్నడూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆటోల వాళ్లకు చెబితే ఇంటి దగ్గర దించి వెళ్లిపోయేవారని తెలిపారు. కాంగ్రెస్ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నదని, వచ్చే ఎన్నికల్లో తగినబుద్ధి చెప్పడం కాయమన్నారు.
సారూ మాకు పది ఎకరాల పొలం ఉన్నది. యూరియా కోసం నెల రోజులుగా తిరుగుతున్నాం. 10 ఎకరాలు ఉంటే కుటుంబంలో నలుగురం వచ్చి యూరియా కోసం క్యూలైన్లో నిల్చోవాలి. అయినా దొరకడం లేదు. ఎక్కడ, ఎప్పుడు సరఫరా చేస్తున్నారో కూడా తెలియడం లేదు. పట్టణంలోని అన్ని దుకాణాల వద్దకు వెళ్లి అడుగుతున్నాం. పంటలు సాగు చేసి రెండు నెలలు గడుస్తున్నది. యూరియా లేక దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈసారి తీవ్రంగా నష్టపోవాల్సిందే.
– నాగరాజు, రైతు, నెక్కొండ, జడ్చర్ల మండలం
పాలమూరు, సెప్టెంబర్ 18 : మహబూబ్‌నగర్ మండలం కోడూరు, అప్పాయిపల్లి, ధర్మాపూర్ గ్రామాల రైతువేదికల వద్ద యూరియా కోసం రైతులు గురువారం బారులుతీరారు. ఈ క్రమంలో రైతువేదిక పరిధిలోని గ్రామాల వారికే యూరియా పంపిణీ చేయాలని కాంగ్రెస్ నాయకులు అధికారులకు చెప్పారు. దీంతో ధర్మాపూర్, అప్పాయపల్లి గ్రామాల రైతులు ఆగ్రహించి రైతు సహకార సంఘం వద్ద గల జాతీయ రహదారిపైకి వచ్చి కంపచెట్లు వేసి నిరసన తెలిపారు. రోజుల తరబడి రాత్రింబవళ్లు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే రైతువేదిక పరిధిలోనే ఇవ్వాలనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పగా, రైతులు ఆందోళన విరమించారు. కాగా, బుధవారం రాత్రి యూరియా కోసం కోడూరు రైతువేదిక వద్ద రైతులు యూరియా కోసం అక్కడే నిద్రించారు.
అమరచింత, సెప్టెంబర్ 18 : యూరియా కోసం తిరిగి వేసారిన రైతులు అధికారుల తీరును నిరసిస్తూ గురువారం అమరచింతలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద గల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి అక్కడే భోజనాలు చేశారు. రైతుల ధర్నాలో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆత్మకూర్, అమరచింత ఆగ్రోస్ కేంద్రాలకు 300 బస్తాల చొప్పున యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున కేంద్రాలకు తరలివచ్చారు. వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల కిందట టోకెన్లు ఇచ్చి పంపిణీ చేస్తామని చెప్పి తీరా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఆందోళన విషయం తెలుసుకున్న మండల వ్యవసాయశాఖ అధికారి అరవింద్ రైతుల వద్దకు వచ్చి 500 మందికి టోకెన్లు పంపిణీ చేశారు. రైతులకు ఇచ్చిన తేదీ ప్రకారం యూరియాను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు.
గోపాల్పేట, సెప్టెంబర్ 18 : యూరియా కొరతతో చేతికి రావాల్సిన పంట కండ్ల ముందే నష్టాలను చవిచూడాల్సి వస్తుండడంతో అన్నదాత ఆవేదన చెందుతున్నా డు. పంటలు సాగు చేసిన నాటి నుంచి చే తికొచ్చే సమయం ఆసన్నమైనా ఇంత వరకు సరఫరా చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గోపాల్‌పేటలోని కేంద్రంలోని సిం గిల్ విండో కార్యాలయానికి వచ్చిన ఆ యా గ్రామాల రైతులు యూరియా లేదని తెలిసి ఆగ్రహించారు. కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చే శారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు మ ద్దతు తెలిపారు. గంటకు పైగా ధర్నా చే యడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
రైతుల ధర్నా వద్దకు తాసీల్దార్ పాండు, ఏవో కరుణశ్రీ, ఎస్సై నరేశ్‌కుమార్ చేరుకున్నారు. యూరియా వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు, బీఆర్ఎస్ నాయకులు తేల్చిచెప్పారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ యూరియా పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు సింగిల్ విండోకు కావాల్సినంత యూరియా వస్తుందని, ఇ బ్బందులు పడొద్దని చెప్పారని.. తీరా ఇ క్కడికి వచ్చి చూస్తే ఒక్క బస్తా కూడా లేదన్నారు. ఒక రోజు టోకెన్ల కోసం, మరో రోజు యూరియా కోసం క్యూలో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుందని, అయినా బ్యాగులు పంపిణీ చేస్తారన్న గ్యారెంటీ లే కుండా పోయిందన్నారు.
క్యూలో మహిళలు, వృద్ధులు గంటల తరబడి నిలబడలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు మా నుకొని సింగిల్ విండో కార్యాలయం చు ట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకునే నా థుడే కరువయ్యారన్నారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని, కాంగ్రెస్ సర్కారు రాగానే రైతులకు క ష్టాలు వచ్చాయని మండిపడ్డారు. చివరికి శుక్రవారం యూరియా తెప్పిస్తామని తా సీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ధర్నాలో మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, బీఆర్ఎస్ గ్రామ అ ధ్యక్షుడు రాజేశ్‌గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు మన్యంనాయక్, నాయకులు మానేశ్బాబు, బాల్‌రాజు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.