అచ్చంపేట రూరల్, మే 18 : మక్కల కొనుగోళ్లలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మొక్కజొన్నను కొనుగోలు చేసినా తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు ఆ గ్రహం వ్యక్తం చేస్త్తూ సోమవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. నెలరోజులు గడిచినా మక్కలను కొనుగోలు చేయ డం లేదని, గన్నీ బ్యాగులను సైతం రైతులకు సకాలంలో అందజేయకపోవడంతో తామే బయట ఒక్కసంచికి రూ.33 పెట్టి కొనుగొలు చేస్తున్నామని వాపోయారు.
యాబై కిలోల బస్తాకు హమా లీ పేరుపై రూ.25 అదనంగా వసులు చేస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాలని ఫోన్ ద్వారా ఆర్డీవో యాదగిరి కోరగా ఆయన తాసీల్దార్ ను పరిశీలించాలని ఆదేశించారు. తాసీల్దార్ మార్కెట్ వద్దకు చేరుకొని లారీల అసోసియేషన్ వారితో చర్చించి మార్కెట్ ప్రధాన కా ర్యాలయం గేటుకు ఉన్న తాళం తీసివేయించి రెండు లారీల్ల్లో కొనుగొలు చేసిన మక్కలను తరలించడానికి చర్యలు తీసుకున్నారు.