కోస్గి, ఆగస్టు 18 : నారాయణపేట జిల్లా గుండుమాల్ మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థిని విద్యుదాఘాతానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నారాయణపేటకు చెందిన అంకిత గుండుమాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. మంగళవారం ఉదయం బోర్ మోటర్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురవడంతో కుడి చేయికి తీవ్ర గాయమైంది.
ఆ సమయంలో అక్కడ వంట మనిషి ఒక్కరే ఉండగా.. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి పాఠశాలకు చేరుకోగా ఈ విషయం గోప్యంగా ఉంచాలని సూచించినట్టు తెలిసింది. ప్రిన్సిపాల్ ఉమయ అస్రాని వివరణ కోరేందుకు యత్నించగా ఆమె స్పందించలేదు.