టాలీవుడ్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ ముందు వరుసలో ఉంటుంది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానున్నది. ఎన్టీఆర్ గాయం కారణంగా షూటింగ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన మేకర్స్.. మళ్లీ చిత్రీకరణలో వేగం పెంచారు. ఇక ‘డ్రాగన్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
ఈ సినిమాలో మూడు యాక్షన్ బ్లాక్‌లు ఉంటాయట. ఇవి సాధారణ యాక్షన్ సీక్వెన్స్‌లా కాకుండా, సినిమా రన్‌టైమ్‌లో కీలక మలుపులుగా ఉంటాయని తెలుస్తున్నది. ‘డ్రాగన్’ కథను పరుగులు పెట్టించడంలో ఈ యాక్షన్ బ్లాకులు కీలకపాత్ర పోషిస్తాయట. వీటిలో జైలు నేపథ్యంలో వచ్చే యాక్షన్ బ్లాక్ మొదటిదిగా చెబుతున్నారు. అత్యంత క్లిష్టమైన సెట్టింగుల మధ్య, భారీ హంగులతో ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని, ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన చూపించే ఇంటెన్సిటి ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందని ఇన్సైడ్ టాక్. ఇక రెండో యాక్షన్ బ్లాక్ కాళీమాత దేవాలయం ప్రాంగణంలో ఉంటుందట. ఆర్ట్ డిపార్ట్మెంట్ సృష్టించిన మ్యాజిక్ ఈ ఫైట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట.
ఈ యాక్షన్ సీకెన్స్లో ఎన్టీఆర్ రౌద్రరూపం ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుందని వినికిడి. ఇక ఈ సినిమాలోని మూడు యాక్షన్ సీక్వెన్స్‌లో అత్యంత క్రూరమైన, భావోద్వేగంతో కూడిన ఎపిసోడ్‌గా ‘బ్లడ్ ఫైట్ ఎపిసోడ్’ని చెబుతున్నారు. కథను ైక్లెమాక్స్కి తీసుకెళ్లే ఈ ఘట్టం.. ఓ పోరాటంలా కాకుండా ఓ యుద్ధంలా ఉంటుందట. ఈ ఎపిసోడ్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్ తనదైన శైలిలో రక్తపుటేరులు పారించినట్టు తెలిసింది. ఎన్టీఆర్ తన నటనతో ఈ ఎపిసోడ్‌కు ప్రాణం పోశారని చిత్రబృందం చెబుతున్నది. ఎన్టీఆర్ అభిమానులకు ఈ మూడు ఎపిసోడ్స్ విజువల్ ఫీస్ట్ కానున్నాయని సమాచారం.