భూత్పూర్, మే 3 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొ నాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో కొనుగోలు కేంద్రం వద్ద కర్షకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భం గా పలువురు మాట్లాడుతూ గతంలో గో ప్లాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేటోళ్లని.. కానీ ప్రస్తుతం ఏ ర్పాటు చేయకపోవడంతో రైతులు దాదా పు 4 కి.మీ. దూరంలోని భూత్పూరుకు ధాన్యం తెచ్చి విక్రయించాల్సి వస్తుందని వాపోయారు.
దీంతో సమయం, ఖర్చు అధికం అవుతున్నాయన్నారు. దీనికి తో డు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కేంద్రం వద్ద ఉంచిన ధాన్యం తడిచి.. కొ ట్టుకుపోయిందని ఆవేదన చెందారు. అ ధికారులు కల్లాల వద్దకు రాకుండా కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకురావాలని సూచించడం సరికాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలోనూ అధికారులను కల్లాల వద్దకు వచ్చి ధా న్యాన్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
రైతుల డిమాండ్ మేరకు చివరకు తాసీల్దార్ జయలక్ష్మి గోప్లాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల సమస్యలను అడిగి తె లుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌ డ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, నా యకులు మురళీధర్‌గౌడ్, రాములు, వెంకటయ్య, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.