కల్వకుర్తి, మార్చి 22 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం నుంచి సాగునీరు ఇవ్వాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నల్లగొండకు సాగునీరు ఇవ్వకుండా అడ్డుకోవాలని, కేఎల్ఐ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే డిమాండ్‌తో శనివారం కల్వకుర్తి పట్టణంలోని టీయూటీఎఫ్ భవనంలో పాలమూరు అధ్యయ న వేదిక, కల్వకుర్తి జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రౌం డ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ఇరిగేషన్ నిపుణులు కేవీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
పార్టీలకతీతంగా హాజరైన నాయకులు, నేతలు జలదోపిడిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాఘవాచారి మాట్లాడుతూ 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతోనే నీళ్ల విషయంలో పాలమూరుకు అన్యాయం ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన కండ్ల ముందే మనకు దక్కాల్సిన సాగునీటిని నల్లగొండ జిల్లాకు తరలించుకుపోతుంటే అడ్డుకోవాల్సిన జిల్లాకు చెందిన ఎ మ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాకు దక్కాల్సిన కృ ష్ణా జలాలను ఏదుల రిజర్వాయర్ ద్వారా నల్లగొండ జిల్లాకు తరలించే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎంతోపాటు ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. అనంతరం నల్లగొండకు పాలమూరు నీటి తరలింఫును అడ్డుకోవాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ సదానందం, నాయకులు ఆంజనేయులు, పరుశరాములు, బాబిదేవ్, పరశురాములు, అంజి, రాజేంద ర్, గోపాల్, సైదులు, బాలయ్య, జంగయ్య పాల్గొన్నారు.