బాలానగర్, మార్చి 12: పంటలకు చాలినంత నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన రైతు యాదయ్య ఆరుగాలం శ్ర మించి నాటిన వరిపంట నీళ్లు లేకపోవడంతో పొ లం బీటలువారింది. వ్యవసాయశాఖ అధికారుల ముందస్తు సూచనలు లేకపోవడంతో ఆశగా నాటిన వరిపంట చేతికి రాకుండా పోయింది. రైతు యాదయ్య ఎకరా పొ లంలో వరిపంట వేశారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పంటలకు చాలినంత నీరందక పోవడంతో పక్కపొలం రైతును బతిమాలుకొని పంటకు నీరు పెట్టుకునేవాడు.
పక్కపొలం రైతు తాను పొలంలో వేసిన పంటకు నీరు సరిపోకపోవడంతో యాదయ్య పొలానికి నీరు ఇవ్వడం మానేశాడు. దీంతో వరిపొలంలో నీరులేక పంట ఎండిపోయినది. కడుపుకింత అన్నం దొరుకుతుందని ఆశపడిన రైతు యాదయ్య సాగు చేసిన పంట కళ్లముందే ఎండిపోతుంటే బావురుమంటున్నాడు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని వాపోతున్నాడు. బుధవారం ఎండిపోయిన యాదయ్య పొలాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్, వ్యవసాయశాఖ అధికారి సుజాత భూగర్భజలాలు అడుగంటిపోయిన కారణంగా వరి పంటను కాకుండా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచిస్తున్నారు.