బాలానగర్, మార్చి 22 : ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు ఎండిపోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి బా లానగర్ మండలంలోని పెద్దరేవల్లి, చిన్నరేవల్లి, మొదంపల్లి, బోడజానంపేట, తిర్మలగిరి, నం దారం, ఏడుగుట్టలతండా, మల్లేపల్లి, ఈద్గానిపల్లి, హేమాజిపూర్ తదితర గ్రామాల్లో రైతులు సాగుచేసిన వందల ఎకరాల్లో వరిపంటలు నీరులేక ఎండిపోతున్నాయి.
భూగర్భజలాలు గరిష్ట స్థాయికి పడిపోవడంతో బోర్లలో చుక్కనీరు రా వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల ఖర్చులు, ఎరువుల కొనుగోలు, ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే భరించలేక పోతున్నామ ని, తిండి గింజలు, పశువులకు పశుగ్రాసం కూడా మిగిలే పరిస్థితి లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
భూగర్భజలాలు పడిపోవడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. చెరువులు, కుంటల కింద ఉన్న పొలాలకు సైతం నీరందే పరిస్థితి లేదు. అడుగంటిపోయిన భూగర్భజలాల కారణంగా చాలాచోట్ల పంటలు ఎండిపోతున్నాయి. పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– సుజాత, ఏవో బాలానగర్