గద్వాల, ఏప్రిల్ 28: ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు పంటను అ మ్ముకుందామంటే అడుగడునా కష్టాలు త ప్పడం లేదు. ఎంతో వ్యయప్రయాసాలకో ర్చి చెమట చిందించి పంటను పండిస్తే దాని ని అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పాలకులు కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేస్తున్నాం, రైతులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా మక్క కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేసింది గోరంత మార్కెట్లో కొనుగోలు చేయాల్సింది కొండంత ధాన్యం ఉం ది.
ప్రస్తుతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి నా నా తంటాలు పడుతున్నారు. పంట చేతికి వచ్చి అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ఇక్కడ మక్కలు కొనుగోలు చేయడంలో అధికారులు ఆలస్యం చేస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం లేని పోని కొర్రీలు విధిస్తుండంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్ల కోసం గంటల తరబడి నిలబడిన ఆ రోజు టోకెన్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ రైతులకు టోకెన్ లభించినా ఎప్పు డు కొనుగోలు చేస్తారో.. కొనుగోలు చేసిన మొక్కలు ఎప్పుడు గోదాంలకు తరలిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రైతులు మక్కలు అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే కనీస సౌకర్యాలు అధికారులు కల్పించడంలో మార్కెట్ అధికారులు పూర్తిగా విఫలమవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లో 80,634 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున వేసుకున్నా సుమారు 21.53 లక్ష ల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ దిగుబడిని సేకరించడానికి జిల్లా వ్యాప్తంగా 43 లక్షల గన్నీబ్యాగులు అవసరమవుతాయి అని తెలిసిన ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేవ లం 52వేల బస్తాలు అధికారులు రైతులకు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వాస్తవంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో పౌరసరఫరాల, వ్యవసాయశాఖలు సమన్వయంతో పని చేయడంతో వరి ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో సజావుగా సాగుతున్నా యి. ఆ శాఖల మధ్య ఉన్న సమన్వయం ప్రస్తుతం వ్యవసాయ, మార్క్ఫెడ్ శాఖల మధ్య లేక పోవడంతో మొక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
తాము కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొచ్చి 14 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కాంటా వేయలేదు. గత 14 రోజుల నుంచి అన్ని పనులు వదులుకొని ధాన్యం దగ్గర కాపలా ఉంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. తమ మక్కలు ఎప్పుడు కాంటా వే స్తారని అడిగితే సీరియల్ నెంబర్ ప్రకారం వేస్తామని చెబుతున్నారు. పంట పండించడానికి కష్టపడాలి, పండించిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు పడాలి. రైతుల పరిస్థితి కాంగ్రెస్ పా లనలో అధోగతి పాలైంది.
– రాముడు, రైతు, బూడిదపాడు