మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 1 : బోనస్.. బోగస్ అయ్యింది. సన్నరకం వడ్లు పండించిన రైతులకు ప్రోత్సా హకంగా ప్రభుత్వం అందిస్తానన్న బోనస్ రైతుల ఖాతాల్లో జమకాలేదు. యాసంగిలో రైతులు ఎక్కువగా దొడ్డురకం వరిని సాగుచేస్తారు. క్వింటాకు ప్రభుత్వం రూ.500 బో నస్గా అందిస్తామని ప్రకటించడంతో ఈ యాసంగిలో జిల్లాలో రైతులు 65 శాతం విస్తీర్ణంలో సన్నరకం వరినే సా గు చేశారు. అయితే యాసంగిలో సన్నరకం ధాన్యం పం డించి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో విక్రయించినా నేటికీ రైతులకు బోనస్ అందలేదు. వానకాలం పంటల సీజన్ ఆరంభమైనా బోనస్ అందకపోవటంతో కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ యాసంగి 2024-25 సీజన్లో జిల్లాలో 1,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 1,04,000 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యా న్ని రైతులు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయి ంచారు. ఈ ధాన్యానికి సంబంధించి కర్షకులకు రూ.52 కోట్ల బోనస్ కింద అందాల్సి ఉన్నది. సన్నరకం వడ్లు పండి ంచటంలో ఎన్నో వ్యయ ప్రయాసలున్నాయి. సన్న రకం వరికి తెగుళ్లు, చీడపీడలు, దోమపోటు ఎక్కువగా ఉంటా యి. దీంతో పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. ప్రభు త్వం బోనస్ అందిస్తుందనే ఆశతో రైతులు సన్నరకం వరి సాగు కు మెగ్గుచూపారు. యాసంగి ధాన్యం అమ్మి నెలన్నర రోజు లు కావస్తున్నా బోనస్ డబ్బులు అందకపోవటంతో రైతు లు ఆందోళనకు చెందుతున్నారు. అసలు అందుతుందో.. లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు వారం రోజుల వ్యవధితో ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం నగదు బ్యాంకు ఖాతాల్లో జమ కావాలి. అయితే సర్కారు అందించే బోనస్ మాత్రం ఒకింత ఆలస్యంగా జమవుతోంది. గత వానకాలం సీజన్లో కూడా రైతులకు అదాల్సిన బోనస్ అలస్యమైంది. ఈ సీజన్లోనూ అదే పరిస్థితి ఎదురవడంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వానకాలం పంటల సాగు పెట్టుబడులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లు చిట్టచివరి దశకు చేరుకున్నాయి. కోనుగోలు కేంద్రాలు సైతం విడుతల వారీగా మూసివేస్తున్నారు. పాలమూరు జిల్లాలో సన్నరకం 1,04,000 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం ధాన్యం 54,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించారు. ఇందుకుగానూ మొత్తం రూ.365 కోట్ల చెల్లింపులకుగానూ ఇప్పటి వరకు రూ.363 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.2 కోట్లు బకాయీలు ఉన్నాయి. వీటితోపాటు బోనస్ డబ్బు లు రూ.52.71 కోట్లు బకాయి పేరుకుపోయింది. ధాన్యం సేకరణ, బోనస్ బకాయిలు మొత్తం రూ.54.71 కోట్లు రైతులకు ప్రభుత్వం బకాయి పడింది.
యాసంగి సీజన్ 2023-24లో సేకరించిన ధాన్యం కంటే సీజన్ (2024-25)లో 6 రెట్లు అధి కంగా ధాన్యం సేకరించాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చర్యలు చేపట్టాం. పాల మూరు జిల్లాలో సన్న ధాన్యం విక్రయిం చిన రైతుల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించాం. ధాన్యం సేకరణకు సంబంధించి బకాయి ఉన్న రూ.2 కోట్లు త్వరలో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. బోనస్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది.
– రవినాయక్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, మహబూబ్‌నగర్