అయిజ, జూలై 16 : సీడ్‌పత్తి రైతులను కంపెనీలు దగా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి సీడ్‌పత్తి పండించిన రైతన్నలను కంపెనీలు, ఆర్గనైజర్లు నిండా ముంచుతుండడంతో కడుపు మండిన రైతాంగం రోడ్డెక్కారు. ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీల వరకు పత్తి విత్తనాలనే తీసుకుంటామని కంపెనీలు సూచించడంతో దిక్కుతోచని స్థితిలో సీడ్‌పత్తి పంటను రైతులు తొలగించుకుంటున్నారు. ఎకరాకు రూ. 50 వేలకు పైగా పెట్టుబడులు పెట్టి ఇప్పుడు పత్తిపంటను తొలగించమంటే లక్షల్లో నష్టపోవాల్సి వస్తుందని కంపెనీలు, ఆర్గనైజర్లను రైతులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో 50వేల ఎకరాలకు పైగా సీడ్‌పత్తిని రైతులు సా గు చేశారు. గత ఏడాది వరకు ఎంత పంట పండించినా రైతుల దగ్గర నుంచి కంపెనీలు, ఆర్గనైజర్లు పంటను కొనుగోళ్లు చేసేవారు. ప్రస్తుతం కంపెనీల దగ్గర సీడ్‌పత్తి విత్తనాల నిల్వలు పేరుకు పోయాయనే నెపంతో కంపెనీలు ఎకరాకు కేవలం 150 కేజీల సీడ్‌పత్తి విత్తనాలను తీసుకుంటామని, మిగితా సీడ్‌పత్తి విత్తనాలు తమకు సంబంధంలేని కంపెనీలు రైతులకు స్పష్టం చేస్తున్నారు. గత ఏడా ది ఎకరాకు 6 క్వింటాళ్ల నుంచి 8 క్వింటాళ్ల పత్తి విత్తనాలను రైతులు పండించారు. పండించిన విత్తనాలను కంపెనీలు తీసుకొన్నప్పటికీ నేటి వరకు పూర్తిస్థాయిలో రైతులకు నగదు చెల్లించకపోవడం, ప్రస్తుతం ఎకరాకు 150 కేజీల విత్తనాలను తీసుకుంటామని రైతులకు చెప్పడంతో గత్యంతరం లేక రైతులు సీడ్‌పత్తిని తొలగించుకుంటున్నారు.
ఒక్కో రైతు నాలుగైదు ఎకరాల్లో సీడ్‌పత్తి పంటను సాగు చేయగా, ప్రస్తుతం 2,3 ఎకరాల్లో పం టలను తొలగించుకుంటున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే ఎకరాకు 150 కేజీలను తీసుకుంటామని స్పష్టం చేసి ఉంటే సీడ్‌పత్తి సాగు చేసేటోల్లంకాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు చేసి, క్రాసింగ్‌కు వచ్చే వేళ సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు చెప్పడటంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా నడిగడ్డలో సీడ్‌పత్తి పం టను సాగు చేస్తున్నామని, ఎన్న డూ లేని విధంగా ఇప్పుడే సీడ్‌పత్తి విత్తనాలపై పేచి పెట్టడం చూస్తుంటే కంపెనీలు రైతులను నట్టేట ముంచేందుకేనని మండిపడ్డారు. సీడ్‌పత్తి పండి ంచే రైతులను కంపెనీలు, ఆర్గనైజర్లు మోసం చేస్తున్నా సర్కారు స్పందించడం లేదని వి మర్శించారు. రైతులను ముంచిన సీడ్‌పత్తి కంపెనీలేమో లక్షల కోట్లు సంపాదించడం, వేల ఎకరాలు, ఆస్తు లు కూడపెడుతున్నాయని, సీడ్‌పత్తి పండించిన రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు కిక్కురుమనడం లేదని పేర్కొన్నారు.
సీడ్‌పత్తి కంపెనీలు రైతులకు చేస్తు న్న దగాపై రైతన్నలు కన్నెర్ర జేశారు. అయిజ మండలంలోని బింగిదొడ్డి గ్రామ సమీపంలో అయిజ – గద్వాల రోడ్డుపై ఐదు గంటల పా టు ధర్నా చేపట్టారు. కలెక్టర్ వచ్చే వరకు ధర్నాను వరమించేదిలేదని రైతులు స్పష్టం చేశారు. తాసీల్దార్ జ్యోతి, సీఐ టాటాబాబు, ఎస్సై శ్రీనివాసరావు ధర్నాను విరమించాలని కోరినా రైతులు విరమించలేదు. సీడ్‌పత్తి తొలగించిన రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు పరిహారం అందించడంతోపాటు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గత ఏడాది సీడ్‌పత్తి విత్తనాల డబ్బులను వందశాతం చెల్లించాలని కోరారు.
ప్రభుత్వం సీడ్‌పత్తి కంపెనీలతో చర్చించి, ఈ ఏడాది సీడ్‌పత్తి విత్తనాలను మొత్తం తీసుకునేలా చూడాలన్నారు. డీఎస్పీ మొగులయ్య రైతులతో చర్చించి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో మాట్లాడించడంతో రైతులు శాంతించారు. రైతుల మెరుపు ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి. ఐదు గంటలు రాకపోకలు నిలిచిపోవడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సీడ్‌పత్తి రైతులు చేపట్టిన మెరుపు ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంక ట్రాములు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, నాగేశ్‌లు రైతుల ధర్నాకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, కంపెనీలపై సర్కారు పర్యవేక్షణ లేకపోవడంతోనే రైతులను నట్టేట ముంచుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీడ్‌పత్తి రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.