హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఓవైపు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుంటే మరోవైపు ఎన్నికల కోలాహలం నెలకొన్నది. దేవరాజ్, ఎస్జే శ్రీనివాస్ పదవి కాలం ముగియడంతో ఖాళీ అయిన కార్యదర్శి, కోశాధికారి పదవుల కోసం హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. కీలకమైన ఈ రెండు స్థానాల కోసం వివిధ క్లబ్‌ల నుంచి పలువురు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.
ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్‌కు తమ నామినేషన్లు సమర్పించారు. ఇందులో చిట్టి శ్రీధర్, ఆగంరావు, అనిల్‌కుమార్, బాబురావు, హరి నారాయణరావు, అజ్మల్ అసద్, జీవన్‌రెడ్డి రెండు పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి.