గోపాల్పేట, జనవరి 18 : మండలంలోని ఏదుట్లలో రూ.కోటీ 96లక్షలతో నూతనంగా ని ర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఈ నెల 9వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి అట్టహాసంగా ప్రారంభించా రు. కాగా, నాటి నుంచి నేటి వరకు విద్యుత్ సరఫరా చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం గ్రామస్తులు, రైతులు విద్యుత్ ఉపకేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లో వోల్టేజీ సమస్య ను అధిగమించేందుకు కేసీఆర్ సర్కారులో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకొని గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేయించి పనులు కూడా పూర్తి చేయించారన్నారు.
ఎన్నికల కోడ్ కారణం గా ప్రారంభానికి నోచుకోకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ నెల 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా ప్రారంభించి నేటి వరకు గ్రామానికి విద్యుత్ సరఫరా చేయకపోవడమేమిటని ప్ర శ్నించారు. లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రానున్నది వేసవి కావడంతో మరింత ఇబ్బందులు తలెత్తుతాయని ఆ వేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ హర్షవర్ధన్‌రెడ్డిని వివరణ కోరగా, విద్యుత్ ఉపకేంద్రం నిర్మించిన కాంట్రాక్టర్ తమకు అప్పగించలేదని, ఇందుకు సంబంధించి పేపర్ వర్క్ చేయాల్సి ఉందన్నారు. ఆపరేటర్లు కూడా అలాట్ కాలేదని, ఇవి పూర్తయితే సోమ, మంగళవారం విద్యుత్ ఉప కేంద్రం ద్వా రా గ్రామానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు, రేవల్లి మండలాధ్యక్షుడు రఘురామారావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, మాజీ వైస్ ఎం పీపీ చంద్రశేఖర్, మాజీ సర్పంచులు శ్రీనివాసు లు, వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, నాయకులు ఎండీ మతీన్, గోపాల్, వడ్డె గోపా ల్, రైతులు కిషన్‌రావు, ధర్మయ్య, వెంకటేశ్వర్రావు, చల్మారెడ్డి, బాలకిష్టయ్య, శ్రీను, బంగారయ్య, ఆంజనేయులు, కృష్ణయ్య, శ్రీశైలం, గౌరయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.