Agricultural Acts | పెద్దమందడి, మార్చ్ 22: రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉత్తరయ్య అన్నారు. ఇవాళ పెద్దమందడి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార జిల్లా కార్యదర్శి వి రజని సూచనల మేరకు రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ఉత్తరయ్య మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే లక్ష్యంగా విత్తన చట్టం 1966 రూపొందించబడిందని తెలియజేశారు. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ అమ్మినా.. నకిలీ ఉత్పత్తులను అందించినా కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఉచిత న్యాయ సేవల కొరకు జిల్లా కోర్టు పరిసరాల్లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాలు పొందడం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ భీమయ్య, రైతులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు