కల్వకుర్తి, జూలై 21 : నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర విపరీతంగా పెరగడంతో.. పాత ధరకే డీఏపీని విక్రయిస్తున్నామంటూ నకిలీ డీఏపీని రైతులకు విక్రయించి నిలువునా ముంచుతున్నారు. నకిలీ డీఏపీ బస్తాపై పీఎం నరేంద్రమోదీ ఫొటోతో ఇఫ్ కో కంపెనీ భారత్ డీఏపీ పేరుతో ఆకర్షణీయమైన అక్షరాలతో ముద్రించి రైతులను నట్టేట ముంచుతున్నారు. కల్తీలేని పంటలను పండించే రైతులు ఎరువుల్లో కూడా నకిలీలు ఉంటాయా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జి ల్లాలో నకిలీ డీఏపీ ఎరువులు పట్టుబడడం సంచలనంగా మారడంతోపాటు కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయాలు కలకలం రేకెత్తిస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల కిందట బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో 111 బస్తా లు, నిన్నరాత్రి తాడూరు మండలం ఆకునెల్లికుదురులో 80 బస్తాల నకిలీ డీఏపీ బస్తాలు పట్టుబడ్డాయి. రాత్రి వేళలో కొందరు వ్యక్తులు వాహనాలలో నకిలీ డీ ఏపీ బస్తాలు తీసుకువస్తున్నారు. డైరెక్ట్‌గా కంపెనీ నుంచి తీసుకువస్తున్నాం.. పాత ధరకు (తక్కువ ధరకు) ఇస్తు న్నాం అంటూ రైతులకు టోకరా పెడుతున్నారు. ప్యా కింగ్ కూడా ఒరిజినల్ సంచుల్లాగే ఉండడం, సంచులపైన ప్రధాని మోదీ బొమ్మ ఉండడంతో రైతులకు నకిలీ ఎరువులు అనే అనుమానం రావడం లేదు. దీనికి తోడు డీఏపీ ఎరువుల ధరకు కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో.. రైతులు ఏమి ఆలోచించడం లేదు.
నకిలీ డీఏపీల వ్యవహారం గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. స్థానికంగా ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో ఈ వ్యవహారం సాగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. లోకల్‌గా సపోర్టు లేకుండా బయటి వ్యక్తు లు నకిలీల దందాను అంత సునాయాసంగా నడిపించలేరు. నకిలీ డీఏపీ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డీఏపీ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నకి లీ డీఏపీ ఎరువుల అంశమై పోలీసులు పలువురిపై కేసు లు నమోదు చేశారు.
నకిలీ ఎరువుల రవాణా, ని ల్వ, విక్రయాలపై పూర్తి సమాచారాన్ని సేకరించడంలో జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. ఎక్కడ నుంచి నకి లీ ఎరువులు వస్తున్నాయి.. ఎవరు తీసుకువస్తున్నారు. స్థానికంగా ఎవరెవరు సహకరిస్తున్నానే అంశాలపై పోలీసులు లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువుల నమూనాలను ప్రయోగశాలకు పంపించినట్లు తెలుస్తుంది. వచ్చిన రిపోర్టుల ఆధారంగా మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. విచారణలో తమ దృష్టికి వచ్చిన సమాచారం మేరకు మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.