Nagarkurnool | తిమ్మాజిపేట, మే 30 : తిమ్మాజిపేట మండలంలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏవో కమల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర నకిలీ ( లూజ్ సీడ్ ) పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి కలిసి తనిఖీలు నిర్వహించారు. వెంకటయ్య అనే వ్యక్తి దగ్గర నకిలీ పత్తి విత్తనాలు 10 కిలోలు దొరికినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో మరికొందరి ఇళ్లల్లో కూడా తనిఖీలు నిర్వహించినట్లు ఏవో తెలిపారు. లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే చట్టరీత్యా నేరమన్నారు. నకిలీ పత్తి విత్తనాలు ఎవరి దగ్గరున్న చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏవో హెచ్చరించారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏవో తెలిపారు.