వడ్ల కోసం పోరు హోరెత్తింది. రైతన్నకు అండగా టీఆర్ఎస్ కదం తొక్కింది. కేంద్రంపై చావుడప్పు మోగించింది. ఢిల్లీలోని మోదీ సర్కార్‌కు సెగలు తగిలేలా నిరసనలు కొనసాగించింది. గురువారం జిల్లా కేంద్రాల్లో చేపట్టిన ధర్నాలు దద్దరిల్లాయి. రహదారులు గులాబీమయమయ్యాయి. కర్షకులు స్వచ్ఛందంగా..భారీగా తరలొచ్చారు. వరి కంకులతో ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. పాలమూరులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి నిరసన దీక్షలకు హాజరయ్యారు. ఆయా జిల్లా కేంద్రాల్లో విప్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్లు, చైర్పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిగ్గులేని బీజేపీ.. కేంద్రానికి పాడె కడుతాం.. అంటూ మంత్రులు విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
వనపర్తి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొ నుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కేం ద్ర ప్రభుత్వానికి పాడె కడుదామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతు ల శాపం ఉరికేపోదని, మోదీ ప్రభుత్వానికి నూకలు చెల్ల డం వల్లే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని వి మర్శించారు. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు జిల్లా కేం ద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం చక్రవర్తి కా దని.., రాష్ర్టాలు వారికి సామంతులు కాదన్నారు. ధాన్యం కొనేదాకా ఉద్యమం కొనసాగుతుందన్నారు. దేశంలో పంట కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. కేంద్రం కుట్రపూరి త ఉద్దేశాన్ని గ్రహించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించామన్నారు. అయినప్పటికీ ఇక్కడి బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వరి సాగు చేయాలని, ధా న్యం కొనుగోలు చేసే బాధ్యత తీసుకుంటామని రైతులను మోసం చేశారన్నారు. ఇప్పుడు కొనుగోలు విషయంలోనోరు మెదపడం లేదన్నారు. బండి కాదు తొండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు భయం అనేది తెలియదన్నారు. స్వతంత్య్ర పోరాటం నుంచి తెలంగా ణ సాయుధ పోరాటం, రాష్ట్ర ఆవిర్భావం వరకు పోరాడి సా ధించుకున్నట్లు గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంతోపాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నె లల ఆందోళనల వరకు రైతుల భాగస్వామ్యం ఉన్న పోరాటాలన్నీ విజయవంతమయ్యాయన్నారు. ఉత్తరాది రైతుల అలుపెరుగని పోరాటానికి మోదీ నల్ల వ్యవసాయ చట్టాలను వెన క్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
దేశంలో 20 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు. తెలంగాణలో రూ.1.50 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించి సాగునీటిని అం దుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. అంతేకాకుండా రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెం టు వంటి పథకాలతో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. పంజాబ్‌లో ఏడాదికి రెండు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే.. తెలంగాణలో మూడున్నర కోట్ల ట న్నుల ధాన్యం పండుతుందన్నారు. ప్రాజెక్టులు, పథకాల విషయంలో కేంద్రం ఏనాడూ సహకారం అందించలేదన్నారు. కరోనా విపత్తులో 22 కోట్ల మంది ఆహారం లేక తండ్లాడినా కేంద్రం పట్టించుకోలేదన్నా రు. బియ్యం నిల్వలను పందికొక్కులు, ఎలుకల పాలు చేశారని విమర్శించారు. నూకలతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలని కేంద్రాన్ని కోరితే బియ్యం ఇవ్వాలని చెబుతున్నదని విమర్శించారు. ప్రజలకు నూకలు అలవాటు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ అహంకార పూరిత వ్యాఖ్యలు చేశాడన్నారు. దేశంలో అంతటా అన్ని పంటలు పండవని, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్ణాటకలో మాత్రమే అన్ని పంటలు పండుతాయన్నారు. త్యాగాలు దేశానివి, మో సాల ఫ్యాక్టరీ గుజరాత్వని విమర్శించారు. దేశాన్ని అమ్ముతున్నది.. కొంటున్నది గుజరాతీయులేనని ఆరోపించారు. మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు.
కేంద్రం లో 14 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే ఎనిమిదేండ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తుందన్నారు. ఎస్బీఐని మోదీ తన స్నేహితుడు ఆదానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభు త్వం రైతులకు న్యాయం చేస్తుంటే.. దేశాన్ని నాశనం చేసే పని లో కేంద్రం ఉందన్నారు. కేవలం పది మంది కార్పొరేట్ శక్తుల కోసం దేశాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. 6 లక్షల కోట్లు బ్యాం కుల నుంచి అప్పు తీసుకొని ఎగనామం పెట్టిన వారికి మోదీ అండగా నిలుస్తున్నాడని విమర్శించారు. నోట్ల రద్దుతో అద్భుతాలు జరుగుతాయని ప్రజలను నమ్మించేందుకు కన్నతల్లిని కూడా బ్యాంకు ముందు లైన్లో నిలబెట్టిన ఘనత మోసకారి మోదీదన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, చావు డప్పు కొట్టి శుక్రవారం ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గర్జన ఢిల్లీకి వినిపించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, కొత్తకోట ఎంపీపీ మౌనిక, వనపర్తి పట్టణ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, దళితసంఘం నేత వెంకటేశ్, నా యకులు, రైతులు ఉన్నారు.
నారాయణపేట, ఏప్రిల్ 7 : కేంద్రం మెడలు వంచైనా ధాన్యా న్ని కొనుగోలు చేయిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని స త్యనారాయణ చౌరస్తా వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే వరకు విశ్రమించమన్నారు. ధాన్యం కొనాలని నిరసన చేస్తుం టే.. బీజేపీ నాయకులు ఆవిర్భావ సంబురాలు చేసుకుంటున్నారన్నారు. కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి, ప్రేమ, గౌరవం లేదన్నారు. వారికి ఆదాని, అంబానీలే ముఖ్యమన్నారు. 20 నెలలుగా నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తే.. కేవలం ఎన్నికల కోసం రైతులకు క్షమాపణ చెప్పి రద్దు చేశాడన్నారు. ఎన్నికల ఫలితాల త ర్వాత 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నా రు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ సర్కార్ హయాంలో రైతుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. రైతులు బాగుపడుతుంటే బీజేపీ కండ్లు మండుతున్నాయన్నారు. కొందరు రైతులు బీజేపీ నాయకుల మాటలు నమ్మి వరి వేశారని.., ప్రస్తుతం బండి సంజయ్, రేవంత్‌రెడ్డి వాటి గురించి మాట్లాడడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ని లుస్తుందన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా శుక్రవారం రైతుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన ఉన్నారో లేదో తెలుపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏడేండ్లలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతే రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా రైతుబంధు తీసుకుంటున్న ప్రతిఒక్కరూ శుక్రవారం తమ ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, దేవరి మల్లప్ప, ఆయా మండలాల రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
గద్వాల, ఏప్రిల్ 7 : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొ నుగోలు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీ ఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు గురువా రం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో దీక్ష చేపట్టారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ ఎంపీ మంద జగన్నాథం, పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ కేంద్రం వైఖరి మా రేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. ధాన్యం మొ త్తం కొనుగోలు చేయకపోతే.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యం లో ఢిల్లీ నడిబొడ్డున ధర్నా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రే మ చూపిస్తుందన్నారు. శుక్రవారం ప్రతిఒక్కరూ త మ ఇంటిపై నల్ల జెండా ఎరగవేసి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. కేంద్రం వైఖరి మార్చుకోకుంటే ఈ నెల 11న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో ఢిల్లీ దద్దరిల్లేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే బీజేపీ నేతలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. వారికి రైతులు, ప్రజలపై ప్రేమ ఉంటే ధాన్యం కొ నుగోలు చేసేలా ప్రయత్నించాలని సూచించారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ రైతు రాష్ర్టానికి వెన్నెముక అని.. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనిషి కి వెన్నెముక లేకుంటే ఎలా ఇబ్బంది పడతాడో.. రైతు లేకుంటే తిండి దొరకక అలాగే ఇబ్బందు లు పడుతామన్నారు. తెలంగాణ రైతులపై కేం ద్రానికి ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ మంద మాట్లాడుతూ ఇక్కడ ప్రగల్బాలు పలుకుతున్న బీజేపీ నాయకులు.. మో దీ ప్రభుత్వాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశ వ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్న య్య, జెడ్పీవైస్ చైర్పర్సన్ సరోజమ్మ, మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ లు ప్రతాప్‌గౌడ్, రాజారెడ్డి, పీఏసీసీఎస్ చై ర్మన్లు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, ప్ర జాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ నేతలకు సిగ్గు లేదని, ధాన్యం కొనుగోలు విషయంలో మోసాలకు పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్రంపై ధ్వ జమెత్తారు. ఆరునూరైనా వడ్లు కొనేవరకు బీజేపీ సర్కార్‌ను వదలమన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం నిరసన దీక్ష ఏర్పాటు చేశారు. ధాన్యం మేమే కొంటామని, సీఎం కేసీఆర్‌కు సంబంధం లేదంటూ.. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి గతంలో మాట్లాడిన వీడియోను దీక్షా వేదిక వద్ద చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిగ్గున్న వ్యక్తులెవరూ మాట తప్పరని బీజేపీని ఎండగట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కేంద్ర మంత్రి అబద్ధాలు చెబుతున్నారన్నారు. 70 ఏండ్లుగా నీళ్లు, కరెంటు, పిండి సంచుల కోసం రైతు పోరాటం చేశాడని.., తెలంగాణ వచ్చాక పరిస్థితిలో ఊహించని మార్పు వచ్చిందన్నారు. రైతులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మొన్న తొండి సంజయ్ ధాన్యం కొంటామని చెప్పి.. ఇప్పుడు ఉలుకూపలుకూ లేదన్నారు. 30 ఏండ్లుగా గుడి పేరిట రాజకీయం చేశారన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తామే ప్రతిష్ఠించామని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న ఘనత బీజేపీ వాళ్లదన్నారు. దేశంలోని రైతులంతా బాగుపడాలని సీఎం కేసీఆర్ ఆశిస్తున్నారన్నారు. ప్రచారం కోసం మతాన్ని, గుడిని, సైన్యాన్ని, సినిమాను కూడా వాడుకునేందుకు బీజేపీ నేతలు వెనకాడడం లేదన్నారు. ఇతరుల ఘనతను కూడా తమదని చెప్పే నీచ రాజకీయం వారిదని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనేవరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నిరసన సెగ ఢిల్లీకి తాకేలా ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగరవేయాలన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులపై బీజేపీ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు.
వడ్లు కొనాలని ఎంపీలంతా పీయూష్ గోయల్‌ను కలిసినా ససేమిరా అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒకలా.. కేంద్రంలో మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తాము నూకలు తినడం కాదు.. బీజేపీ నేతలు గడ్డి తినేలా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ధర్నా చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చిందన్నారు. వడ్లు కొనేలా మేం చూసుకుంటామని చెప్పి.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఏ పథకానికి కేంద్రం పైసా ఇవ్వలేదని, తెచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేసే వరకు బీజేపీని వదిలేది లేదన్నారు. గ్రామీణ ప్రజలకు సైతం బీజెపీ మోసపు వ్యవహారం తెలిసేలా చేయాలన్నారు. పాలమూరు జిల్లా బాగుండాలని భావించి సీఎం కేసీఆర్ పీఆర్ఎల్ఐ తీసుకొచ్చారన్నారు. పంట కోత దశకు వచ్చిన తరుణంలో ధాన్యం పరిస్థితి ఏంటని రైతులు అడుగుతున్నారన్నారు.
ధాన్యం కొనకుండా ఆగం చేస్తున్న బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వడం లేదన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్లకు ప్రజలు, రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి ఇక్కడి పథకాలు అక్కడ ఉన్నాయేమో చూడాలన్నారు. అవసరమైతే తామే ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తామని, మీడియా వాళ్లు కూడా వెళ్లి నిజానిజాలు పరిశీలించొచ్చన్నారు. బీజేపీ సన్నాసులు చేసేదేమీ లేకపోయినా.. జెండా పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మిశివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్లు నర్సింహులు, లక్ష్మీ, డీసీసీబీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సుదీప్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 7 : వడ్లు కొనేదా కా కొట్లాడుతామని, ఇది కేంద్రంలోని బీజేపీ రాజకీయ సమస్య కాదని, ప్రజా సమస్య అని టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ప్ర భుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. మో దీ మొండి వైఖరి వీడే వరకు ఢిల్లీకి వెళ్లి కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం పి లుపు మేరకు విప్ గువ్వల అధ్యక్షతన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ ఒక రాష్ట్రంలో ధాన్యం కొ నుగోలు చేసి.. మరో రాష్ట్రంలో కొనకపోవడం ఏంటని ప్రశ్నించారు. పుష్కలంగా పంటలు పం డుతుంటే ఓర్వలేక కేంద్రం కుట్రలు పన్నుతున్నదన్నారు. రూ.లక్షలు వెచ్చించి రోజుకో కొత్త సూట్ ధరించడమే తప్పా మోదీకి రైతు సమస్యలు తెలవడం లేదన్నారు. బీజేపీ పాపాలు పండాయని, ఏ దో ఒకరోజు కేంద్రంలో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్నది రైతు లు, రాష్ట్ర భవిష్యత్తు కోసమన్నది గుర్తుంచుకోవాలన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు గ్రామస్థాయి నుం చి పోరాటం చేద్దామని, ధాన్యాన్ని బీజేపీ నాయకుల ఇండ్ల ముందే పోసి నిరసన తెలుపాలని పిలుపునిచ్చా రు.
రైతు అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చే స్తుంటే ఓర్వలేని మోదీ ప్రభుత్వానికి కడుపుమండుతున్నదన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతు సమస్యలను ప ట్టించుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యం లో ఢిల్లీ వరకైనా వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో రైతులు హాజరై నిరసన తెలిపారన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రైతుపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనమని చెప్పడం తగదన్నారు. ఎఫ్‌సీఐ ద్వారా గోదాంలను నిర్మించాలన్నారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మా ట్లాడుతూ ఇంతకాలం లేని సమస్య ఇప్పుడే ఎందుకు వ చ్చిందని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనకుండా తాత్సారం చేయడం తగదన్నారు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సా యిచంద్ మాట్లాడుతూ రాష్ర్టానికి చెందిన కొందరు బీజేపీ నాయకుల మాటలు విని కక్షగట్టడం సరికాదన్నారు. అం తకుముందు రెండు వేల మంది రైతులతో గువ్వల బాలరాజు నాగర్‌కర్నూల్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ రాజాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కుర్మయ్య, నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.