పెబ్బేరు, ఏప్రిల్ 12 : పండుగలా ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు తరలిరావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి పెబ్బేరులో జరిగిన బీఆర్ఎస్ ఉమ్మడి మండల కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోవు స్థానిక సం స్థల ఎన్నికలకు ఈ సభ శంఖారావం పూరిస్తుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటడం ఖాయమని, ఈ మేరకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ అండగ ఉండాలని సూచించా రు. కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడాలని, ప్రభుత్వపరంగా అన్యాయం జరిగితే ఎదుర్కొని న్యాయం చేయాలని తెలిపారు. బాధితుల్లో ధైర్యం నింపి వారికి అండగా నిలబడాలన్నారు. సహజంగా అధికారంలో ఉన్నవారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఉంటుందని, కానీ ఇందుకు భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు.
ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని సర్వేల్లో వెల్లడవుతోందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొని, స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ కొట్లాడి రాష్ర్టాన్ని సాధించి పదేండ్లలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని గుర్తుచేశారు. వరి పండించడంలోనూ నెంబర్‌వన్ స్థానానికి ఎదిగి, దేశానికే అన్నం పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు.
వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కార్యకర్తల ఇంట్లో పండుగ వాతావరణంలో సాగాలని కోరారు. బీఆర్ఎస్ మ ండలాధ్యక్షుడు రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, మీడియా సెల్ కన్వీనర్ అశోక్, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల నాయకులు దిలీప్‌రెడ్డి, కర్రెస్వామి, సాయినాథ్, వెంకటేశ్, రాజశేఖర్, వెంకటస్వామి, పృథ్వీరాజు, సుదర్శన్‌రెడ్డి, రమేశ్, ఎల్లారెడ్డి, గోవిందు, బాలచంద్రారెడ్డి, మ జీద్ తదితరులు పాల్గొన్నారు.