ధన్వాడ, ఫిబ్రవరి 21 : ధన్వాడ మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని గున్ముక్ల చెరువులో తప్పా ఏ ఒక్క చెరువులో నీరు కనిపించడం లే దు. ఎంనోనిపల్లి గ్రామంలో సాయికుమార్ అనే రైతు బోరు కింద వరి పంటను సాగు చేశాడు. అయి తే బోరులో నీరు ఇంకిపోవడంతో పం ట ఎండిపోతున్నది.
దీంతో పంటను ఎలాగై నా కాపాడుకోవాలని అప్పు చేసి తన పొలంలో నాలుగు చోట్ల బోరు వేయించాడు. అయినా చుక్క నీరు కూడా పడకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. పంట చేతికి రాకపోవడమే కాకుండా చేసిన అప్పులు ఎ లా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోతున్నాడు.