చారకొండ, డిసెంబర్ 5 : నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకం భాగంగా గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ కోసం విడుదల చేసిన ఆర్అండ్ఆర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
అయినా ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామ పంచాయతీని ఎస్టీ జనరల్‌కు కేటాయించగా.. మూడో విడుతలో భాగంగా నిర్వహించనున్న ఎన్నికలకు ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు ప్రక్రియను అధికారులు ప్రారంభించగా.. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని, ముం పు నుంచి గ్రామాన్ని కాపాడాలంటూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి.