జడ్చర్ల, దేవరకద్ర: మహబూబ్నగర్ ( Mahabubnagar ) ఉమ్మడి జిల్లాలో విద్యుదాఘాతంతో (Electrocution) బాలుడితో పాటు యువకుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జడ్చర్ల ( Jadcharla ) మున్సిపల్ పరిధిలోని సర్వస్వతినగర్ కాలనీలో ట్రాన్స్పార్మర్కు ప్రమాదవశాత్తు తగిలి కాంగ్రెస్ నాయకుడు బొక్క రాఘవేందర్ చిన్న కుమారుడు శ్రేయన్స్ (10) విద్యుదాఘాతానికి గురై చనిపోయారు.
ట్రాన్స్ఫార్మర్ ( Tranfarmer ) చుట్టూ కంచె వేయాలని విద్యుత్ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాలుడు చనిపోయాడని స్థానికులు ఆరోపించారు. శ్రేయోస్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు.
దేవరకద్ర మండలంలో ..
మండలంలోని వెంకటయ్య పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి వీధిలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో గ్రామంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శివ (22) అనే యువకుడు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమ్తితం జిల్లా ఆస్పత్రికి తరిలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.