మక్తల్, మార్చి 12: యాసంగిలో సాగు చేసిన పం టలకు కరెంటు కోతలకు ఓవైపు, సాగునీటి కొరత ఒకవైపు అనే రైతుల బాధపై బోరుమంటున్నారు శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం మక్తల్ ఏఈ రామకృష్ణ మండలంలోని మదన్పల్లిని సందర్శించి రైతు హుస్సేనోళ్ల చిన్నరాములు పొలం వద్ద కు వెళ్లి పరామర్శించారు. విద్యుత్ సమస్యతో ఏమై నా ఇబ్బందులుంటే ఎప్పటికప్పుడు రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యు త్ సమస్యను పరిషరించేందుకు ఎల్లప్పుడూ విద్యుత్‌శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటామని ఏఈ రైతుకు సూచించారు. విద్యుత్ సమస్యలతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి సమస్యను పూర్తిస్థాయి లో పరిషరించేందుకు నిరంతరం కృషిచేస్తామన్నారు. మదన్‌పల్లి గ్రామం లో ఇప్పటివరకు ట్రాన్ఫార్మర్ల కోసం కట్టినటువంటి డీడీలను ఏఈ పరిశీలించారు. రైతులకు కావాల్సిన ట్రాన్ఫార్మర్లను సకాలంలో అందించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యు త్ సమస్య లేకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.