హబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 4 : మిషన్ భగీరథ రాకముందే భగీరథ కాలనీకి తాగునీరు అందించామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డు పరిధిలోని బీకే రెడ్డి కాలనీ, మైత్రినగర్తోపాటు విఘ్నేశ్వర కాలనీలో మాజీమంత్రి పి. చంద్రశేఖర్, మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వేలాది మంది ప్రజలు హాజరై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఘనస్వాగతం పలికారు. భగీరథకాలనీలో ఓపెన్‌టాప్ ప్రచార రథం నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు కులం, మతం పిచ్చి లేదని, కేవలం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో మహబూబ్‌నగర్ రూపురేఖలు మార్చామని, సుందర పట్టణంగా తీర్చిదిద్దామన్నారు. విద్యావ్యవస్థ బలోపేతంతోపాటు, ఐటీ పార్కును అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. ఇక్కడే హన్వాడ సమీపంలో ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో భగీరథకాలనీ రోడ్లు లేక దుర్గందం వెదజల్లేదని గుర్తుచేశారు. గతంలో పనిచేసిన నాయకులు కనీసం పట్టించుకోలేదన్నారు. యువత, మేధావులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రికి రాత్రి పార్టీలు మారి టిక్కెట్లు తీసుకొచ్చిన నాయకులు ఎన్నికల తర్వాత కనిపించకుండా పోతారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ఘన విజయం సాధించేందుకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు జనవరి తర్వాత పింఛన్ పెరుగుతుందని తెలిపారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. రొట్టెలు చేసే వారు, పండ్ల వ్యాపారం చేసే మహిళలను కలిసి బీఆర్ఎస్ బ్రోచర్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్ సుష్మిత, నాయకులు ప్రభాకర్, ప్రశాంత్ పాల్గొన్నారు.
బీకే రెడ్డి కాలనీని దత్తత తీసుకుంటా..
బీకేరెడ్డి కాలనీ అభివృద్ధి కొందరి వల్ల కుంటుపడిందని, తానే కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీకేరెడ్డి కాలనీలో ప్రచారంలో మంత్రి మాట్లాడారు. మహిళలు మహిళలు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలికారు. అంతకుముందు బీజేపీ నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, షబ్బీర్,నయీమ్ తదితరులు పాల్గొన్నారు.