Friendship | గండీడ్ జులై 5: స్నేహం కేవలం మీ మనుషులకు మాత్రమే పరిమితమనుకుంటున్నారా..? అయితే మావైపు ఓ లుక్కేయండి అంటున్నాయి రెండు మూగజీవాలు. స్నేహం మనుషులకే సొంతం అనుకోవడం ఒక అపోహ మాత్రమేనంటూ ఫొటోలో కనిపిస్తున్న శునకం (కుక్క), బర్రె చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిత్రం చూస్తే జంతువులకూ మానవీయ భావాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.
పచ్చటి పొలాల మధ్య పచ్చిక బయళ్లలో మేత కోసం కట్టేసి ఉన్న ఒక బర్రెపై కుక్క చాలా రిలాక్స్‌గా కూర్చుండగా.. అక్కడే ఉన్న కెమెరా క్లిక్‌మనిపించింది. సహజ ప్రేమ, భరోసా, మానవేతర జీవుల మధ్య మైత్రి.. అనే విలువైన సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉన్న ఈ ఫొటో అందరినీ ఆలోచింపజేస్తుంది. సాధారణంగా కుక్కలు వస్తే బర్రెలు భయపడటమో.. భయపెట్టించడమో చేస్తుంటాయి. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న బర్రె మాత్రం కుక్క తనపైకి ఎక్కి కూర్చున్నా ఏం అనలేదు. కుక్క, బర్రె చాలా ప్రశాంతంగా కనిపించాయి.
ఈ నమ్మకానికి కారణం ఒకరి మీద మరొకరిలో ఉన్న భరోసా, మమకారం. వీటికి యజమాని కూడా ఒక్కరు కాడు వాటి మధ్య స్నేహం ఉండడానికి. సహజంగా ఏర్పడిన బంధమే దీనికి మూలం కావచ్చు.ఈ దృశ్యం చూసిన వారిలో ప్రతి ఒక్కరు ఒక సారి చిరునవ్వుతో పాటు, ఆలోచనలో పడతారు. మనుషుల మధ్య కూడా ఇలాంటి మైత్రిని, ప్రేమను ఎంతవరకు పంచుకుంటున్నాం. ఇది కేవలం ఓ ఫోటో కాదు ఒక జీవన పాఠం. రెండింటి పక్కన కొంతదూరంలో మరో కుక్కను కూడా ఫొటోలో చూడొచ్చు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు