మక్తల్ టౌన్/ అర్బన్, సెప్టెంబర్ 29: పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు శుక్రవారం రాత్రి నిమజ్జనానికి తరలి వెళ్లారు. మండపాల్లో వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వా హకులు ఆజాద్‌నగర్, యాదవ్‌నగర్, గాంధీచౌక్ మీదుగా శోభయాత్ర నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం జరు గుతున్న ఘటనలను కళ్లకు కట్టినట్లుగా ఏర్పాటు చేసిన బొమ్మలు, ఫ్లేక్సీలు ఆకట్టుకున్నాయి. శోభయాత్ర గా వెళ్తున్న గణనాథులకు ఆజాద్‌నగర్ చౌక్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వ హించి నిర్వాహకులకు మెమోంటోలు అందజేశారు. పట్టణంలో వెలసిన 100కు పైగా గణనాథులను శుక్రవారం అర్థరాత్రి వరకు మక్తల్ మినీట్యాంక్బండ్లో నిమజ్జనం చేశారు.
నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు మక్తల్ సీఐ రామ్‌లాల్, ఎస్ఐ పర్వతాలు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తూను ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్య క్రమంలో రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మరికల్, సెప్టెంబర్ 29 : మండల కేంద్రంలో నాయీబ్రాహ్మణ కాలనీ, కురువ గేరి మల్లికార్జున యుత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులను శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. మల్లికార్జున యుత్ మండపం వద్ద లడ్డూ వేలం వేయగా గౌడపోళ్ల రాజేందర్ రూ.లక్ష 16వేలకు దక్కించుకున్నాడు. కార్యక్రమంలో నిర్వహకులు శివ, భాస్కర్, తరుణ్‌రెడ్డి, తిరుపతి, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లంకాల,పాతర్చేడ్,రాయికోడ్,కల్వాల,పెద్దకడ్మూర్ గ్రా మాలతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఘనంగా గణనాధుల నిమజ్జనం చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై సిహెచ్ కురుమయ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
మహ్మదాబాద్, సెప్టెంబర్ 29 : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ, బీసీ కాలనీలో నెలకొల్పిన గణపయ్యలను శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో యువత కోలటాలతో, నృత్యాలు చేస్తూ గణనాథులను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వేణుగౌడ్, వెంకటేశ్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజుగౌడ్, రాఘవేందర్‌గౌడ్, గౌరిశంకర్, సత్యయ్య, కేశవులు, కాశిమయ్య, కుర్వ శివ, రవికుమార్, బొక్క రవి, శేఖర్, వెంకట్రాములు, చెన్నయ్య, చంద్రయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 29 : మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లి, కొత్తపల్లి, వాడ్యాల్, రాణిపేట తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో వినా యకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. యంగ్‌స్టార్స్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాలానగర్, సెప్టెంబర్ 29 : మండలంలోని వనమోనిగూడ గ్రామ వినాయక సేవా సమితి ఆధ్వర్యలో ప్రతిష్ఠించిన గణనాథుడిని శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు తెప్ప మణి ముదిరాజ్ ఆధ్వర్యంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన లడ్డూ వేలం నిర్వహించారు. పెద్ద లడ్డూను గ్రామానికి చెందిన బాలరాజు రూ.1.61లక్షలకు, చిన్న లడ్డూను రూ.65వేలకు దక్కించుకున్నారు. నేరళ్లపల్లిలో గణనాథుడి లడ్డూను బీఆర్ఎస్ ఉటుకుంటతండా గ్రామాధ్యక్షుడు పురందాస్ నాయక్ రూ.40వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, సర్పంచ్ ఖలీల్, వినాయక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 29 : మండలంలోని పారుపల్లిలో శివాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూను రూ.70,116లకు కావలి కృష్ణయ్య, రామాలయం వద్ద గణేశ్ లడ్డూను పసుపుల నరేశ్ రూ.50,116 దక్కించుకొన్నారు.