నవాబ్‌పేట, జూన్ 22 : మండలంలోని లింగంపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే 70శాతం పనులు పూర్తి చేసినా.. ఆ పనులకు నేటికీ బిల్లులు అందక.. మిగిలిన పనులు పూర్తికాకపోవడంతో.. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండగా.. గ్రామ అభివృద్ధి కూ డ కుంటుపడి పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచి పోయినా.. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులపై దృష్టి సారించకపోవడం విడ్డూరం. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నాటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక కృషితో లిం గంపల్లి గ్రామానికి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తమై సుమారుగా రూ.కోటి 50లక్షలు మంజూరయ్యాయి. రూ.85లక్షలతో ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.10లక్షలతో బీసీ కమ్యూనిటీ హాలు, రూ. 20లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూ.15లక్షలతో మహిళా సంఘం భవనం, రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అదే గ్రామానికి చెందిన అప్పటి జెడ్పీటీసీ సభ్యులు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య తదితర నాయకులు వారి సొంత గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే సు మారుగా 70శాతం పనులు పూర్తి చేశారు. భ వన నిర్మాణాలకు చెత్తులు వేసి గోడలు కూడా నిర్మించారు. అంతలోనే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది.
నాటి నుంచి నేటి వరకు చేపట్టిన పనులకు నయా పైసా బిల్లులు కూడా చెల్లింకపోవడమే కాకుండా.. మిగిలిన 30శాతం ప నులను కూడా చేపట్టలేరు. ఈ పనుల విషయంలో నేటి వరకు కూడా సంబంధి త అధికారులు సైతం అక్కడ కన్నె త్తి చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వాలు వస్తుంటా యి.. పోతుంటాయి.. కానీ అభివృద్ధి పనులు మాత్రం పూర్తి చేయించాలి.. కదా అంటూ గ్రామ ప్రజలు వా పోతున్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉం ది. అలాగే విద్యార్థుల కు తరగతి గదులు చా లక అవస్థలు పడుతున్నారు. హెల్త్ సెంటర్ లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ దృ ష్టిలో పెట్టుకొని గత పాలకులు అభివృద్ధి పనులను మంజూరు చేసి.. పనులు చేయిస్తే వాటి కి బిల్లులు ఇవ్వకుండా.. పనులు చెయ్యకుం డా దాటవేత ధోరణి అవలంభించడం ఎంతవర కు సమంజసమని గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి స్పందించి పనులు పూర్తి చే యించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా.. కొన్ని పనులకు ఎం బీ రికార్డు చేశాం.. కానీ ప్రభుత్వం నుంచి డ బ్బులు రాకపోవడంతో వారి ఖాతాల్లో పడలేదు. డబ్బులు రిలీజ్ అయిన వెంట నే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయన్నారు. మిగిలిన పనులకు ఎంబీ రికార్డు చే యాల్సి ఉందన్నారు.