హన్వాడ, నవంబర్ 23 : 55ఏండ్ల పాలనలో కనీసం తాగునీళ్లివ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం గ్రామాల్లోకి వస్తున్నారని.. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం కొనగట్టుపల్లి, యారోనిపల్లి గ్రామాల్ల్లో ఆయన ప్రచారం చేపట్టగా ప్రజలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 11సార్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్లు, ఇంటి చెంతకే నీళ్లు తెచ్చిందన్నారు. కాంగ్రెసోళ్లు రూ.200 పింఛన్ ఇస్తే తమ హయాంలో విడుతల వారీగా రూ.2,016కు పెంచామన్నారు. వచ్చే జనవరి నుంచి వృద్ధులకు రూ.5,016, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని చెప్పారు. అభివృద్ధిని ఆశీర్వదించి మరోసారి పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి కులం పేరుతో ఓట్లు అడుగుతున్నడు, బీజేపీ ఆయనేమో మతం పేరిట పల్లెల్లోకి వస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాళ్లు ఓడిపోతే మరో ఐదేండ్లు కనుమరుగవుతారని ఎద్దేవా చేశారు. “మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళితుల భూములను లాక్కుంటారని ప్రతిపక్ష పార్టీ ల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.. ఎట్టి పరిస్థితిలో దళితుల భూములు తీసుకునేదిలేదు.. దానికి నేనే బాధ్యత” అని మంత్రి హామీ ఇ చ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమం లో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, సర్పంచులు మానస, సుధ, ఎంపీటీసీ చెన్నయ్య, కరుణాకర్‌గౌడ్, రాజుయాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 23 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుల, మతరాజకీయాలు చేస్తాయని, బీఆర్ఎస్ అభివృద్ధే అభిమతంగా పనిచేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సద్దలగుండులో శ్రీనివాస్‌గౌడ్ ప్రజలు ఘనస్వాగతం పలుకగా కార్నర్ మీటింగ్‌లో మంత్రి ప్రసంగించారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా రెండున్నరేళ్లు పాలించి మత కలహాలకు కారణమయ్యారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పొరపాటున గెలిపిస్తే మళ్లీ అలా జరగదని గ్యారెంటీ లేదన్నారు. కండువా మారినంత మాత్రాన వారి బుద్ధి మారదని స్పష్టం చేశా రు. అభివృద్ధి, సంక్షేమంతోపాటు శాంతి భద్రతలు, మతసామరస్యం కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు. తమ పదేళ్ల పాలనతో కాం గ్రెస్ పాలనను పోల్చి చూస్తే జరిగిన అభివృద్ధి అర్థమవుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్తో పదేండ్ల లో రూ.30కోట్లు సాయం అందించి ప్రజల ప్రాణా లు కాపాడామన్నారు. నిర్మాణంలో ఉన్న వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తా ము చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఎం తోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశలు లభిస్తాయని, మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలీశ్వరి, ముడా డైరెక్టర్ సాయిలు, నాయకులు వెంకట్రాములు, ఇ స్మాయిల్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.