బీఆర్ఎస్ జలదీక్ష
నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి గోస తీర్చాలని కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జి ల్లా కేంద్రంలో సోమవారం జలదీక్ష చేపట్టనున్నారు.
- నడిగడ్డ ప్రజల తాగునీటి గోస తీర్చాలని డిమాండ్
- నేడు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల అధ్యక్షతన నిర్వహణ
- హాజరుకానున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
గద్వాల, ఏప్రిల్ 14 : నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి గోస తీర్చాలని కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని డిమాండ్ చేస్తూ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జి ల్లా కేంద్రంలో సోమవారం జలదీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరుకానుండగా ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పా ల్గొననున్నారు. నడిగడ్డ వరప్రదాయిని జూరాల డెడ్ స్టోరేజీకి చేరుకోగా.. తుంగభద్ర నది వట్టిపోవడం తో నడిగడ్డ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 2015-16 తర్వాత ఇంతగా నీటి సమ స్య రావడం ఇదే తొలిసారి. కృష్ణా, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాభావంతో నదు ల్లో నీ ళ్లు లేక ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. జూన్-జూలైలో కొంత మేర వర్షాలు కురిసినా అక్టోబర్ తర్వాత వాన జాడలేకపోవడంతో జలాశయాలు వట్టిపోయాయి.
మిషన్ భగీరథ ద్వారా..
మిషన్ భగీరథ పథకం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని 322 ఆవాసాలు, ఐదు మున్సిపాలిటీ పరిధిలో జూరాల జలాశయం నుంచి రక్షిత తాగునీటిని అందిస్తున్నారు. వీటితోపాటు గ ద్వాలలోని నదీఅగ్రహారం, జములమ్మ ఫిల్టర్‌బెడ్ నుంచి గద్వాలకు, బీచుపల్లి దగ్గర ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేసేవారు. అయితే, జూ రాల డెడ్ స్టోరేజీకి చేరడంతో ప్రాజెక్టు దిగువకు నీ రు రాలేదు. దీంతో నదీఅగ్రహారం వద్ద గద్వాల ప్రజలకు తాగునీరు అందించే కృష్ణా ఫిల్టర్ బెడ్ ద గ్గర నీరు లేకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జములమ్మ ఫిల్టర్ బెడ్ద్వారా సగం గద్వాల పట్టణానికి నీరు అందించే జముల మ్మ రిజర్వాయర్ వట్టిపోయే దశకు చేరుకోవడంతో ఏప్రిల్ చివరి నుంచి గద్వాల పట్టణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది.
వేసవి నుంచి గట్టెక్కేనా..?
నడిగడ్డ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కా వాలంటే ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి దిగువన ఉన్న జూరాలకు 5 టీఎంసీల నీటి ని విడుదల చేయాలి. అందుకోసం తెలంగాణ ప్ర భుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి గద్వాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే బండ్ల జలదీక్ష చేపట్టనున్నారు. కర్ణాటక కనికరించి నీళ్లు విడుదల చేస్తే ఈ వేసవి నుంచి గద్వాల ప్రజలు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయని అధికారులు చె బుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 3.043 టీఎంసీల డెడ్ స్టోరేజీలో నీటి నిల్వ ఉన్నది. ప్రతి రోజూ తాగునీటి అవసరాల కోసం 74 ఎంఎల్డీలు నీరు అవసరమని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ నీరు ఈ నెల చివరి వరకు సరిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మే నెలలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉండడంతో గద్వాల ప్రజలకు అవసరమైన తాగునీరు అందించాలనే ఆలోచనతో ముం దు చూపుతో జలదీక్ష ఎమ్మెల్యే చేపడుతున్న క్రమం లో ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

