మిడ్జిల్, సెప్టెంబర్ 9 : పెండింగ్‌లో ఉన్న పాల బి ల్లులు వెంటనే చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మిడ్జిల్ మండలకేంద్రంలోని క ల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రహదారిపై పాడి రైతులు ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సుదర్శన్, రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండునెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే పాల ప్రోత్సాహక ధరను రూ.5 పెం చుతామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం నేటి వరకు ఎ లాంటి ప్రకటన చేయలేదన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ రాజునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజే పీ నాయకులు నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, రవిగౌడ్, తిరుపతి, శ్రీనివాస్‌రెడ్డి, బంగారు, మల్లయ్య, లాలు, జగన్‌గౌడ్ ,మోహన్, అంజి తదితరులు ఉన్నారు.