బాలానగర్ (రాజాపూర్), సెప్టెంబర్ 13 : మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం రాజాపూర్ మండల కేం ద్రంలో పాడి రైతులు ఆందోళన నిర్వహించా రు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో పశువుల పోషణ భారంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది లీటర్ల పాలను జా తీయ రహదారిపై పారబోసి నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతినెలా ఒకటో తేదీన పాల బిల్లులు వచ్చేవని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలల తరబడిగా పాలు పోస్తున్నా బిల్లులు చెల్లించడం లే దని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామం లో పదిమందికిపైగా పాడిరైతులకు పాల బి ల్లులు రావాల్సి ఉందని, అధికారులను అడిగితే నేడు, రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని, గట్టిగా నిలదీస్తే చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. లక్షలు ఖర్చుచేసి పాడిపశువులను ఖరీదు చేసి పోషిస్తున్నామని, ఇటీవల వర్షాలకు పాడి పశువులు అనారోగ్యం పాలైతే వై ద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏ ర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
పాడి రైతులకు బీఆర్ఎస్ నాయకులు బచ్చిరెడ్డి, శ్రీశైలం యాదవ్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులకు బిల్లులు చెల్లించడంలో విజయ డెయిరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. మండలంలోని పాడి రైతులకు మూడు నెలలుగా రూ.రెండున్నర కోట్ల కు పైగా పాల బిల్లులు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని లేనిచో పాడి పశువులతో జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.