15లక్షల ఎకరాల్లో పంటనష్టం
రైతులకు పంట పరిహారంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా గట్టుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు అందజేశారు.
- పరిహారం, బోనస్ వెంటనే అందించాలి
- బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్
- అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
వనపర్తి, ఏప్రిల్ 2 : రైతులకు పంట పరిహారంతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా గట్టుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తూ నే కరువును వెంట తెచ్చిందని ఎద్దేవా చేశారు. పదేండ్లపాటు భూతల్లిని నమ్ముకొని పంటలు పండించిన రైతులను అధికారంలోకి రాగానే ఎండబెట్టారని ఆరో పించారు.
వంద రోజుల్లోనే రాష్ట్రంలో 15లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని, దీంతో ఇప్పటివరకు 200మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.500 బోనస్ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పం దించి పంటనష్టం కింద ఎకరానికి రూ. 25వేలు, బోనస్ ఇ వ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి నాయకులు తిరుపతయ్య, రవిప్రకాశ్‌రెడ్డి, నరసింహ, రఘువర్ధన్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, ధర్మానాయక్, రంగారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, నాగన్నయాదవ్, రవి, అశోక్, సయ్యద్, జమీల్, గిరి, జోహెబ్, గోపాల్, సునీల్, ఖాదర్, శంకర్, మోహన్‌యాదవ్, కొమ్ము శ్రీను, మర్రికుంట శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

