మానవపాడు, నవంబర్ 4 : పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణలోని అలంపూర్ నియోజకవర్గం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.7,521 మ ద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. దళారులను సంప్రదించకుండా నేరుగా కేంద్రాల్లోనేవిక్రయించాలని, ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూ చించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.