నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్, మార్చి 5 : ఎల్ఎల్బీ సీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాలను వెలికి తీయడం అధికారులు, రెస్క్యూ టీంల కు పరీక్షగా మారింది. 12రోజుల కిందట ఘ టన చోటుచేసుకోగా, చేపడుతున్న సహాయక చర్యలేవీ ఫలితం లేకుండా పోతున్నాయి. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు లోకో ట్రైన్‌ను ఉపయోగించిన అధికారులు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. టీబీఎం మిషన్‌కు అనుసంధానంగా ఉన్న క న్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేసి రన్నింగ్ చేస్తేగానీ సహాయక చర్యలు ముందుకు సాగవని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. కానీ కన్వేయర్ బెల్ట్ సహాయంతో మట్టిని బయటకు తీసే ప్రక్రియ కొన్ని గంటలు మాత్రమే సాగింది. గంటల వ్యవధిలో నడిచిన కన్వేయర్ బెల్ట్ సొరంగం లోపలి భాగంగా మంగళవారం మధ్యరాత్రి 3గంటల ప్రాంతంలో తెగిపోవడంతో సహాయక చర్యలకు పూర్తిగా ఆటంకం కలిగిందని కార్మికులు పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యరాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ ద్వారా జరిగిన సహాయక చర్యల్లో భా గంగా రెస్క్యూ టీం బృందం గతంలో పేరుకుపోయిన మట్టిని మాత్రమే బయటకు తీయగలిగారని తెలుస్తున్నది. నాలుగు రోజులుగా నీటిని తోడుతూ తేలిన మట్టిని టన్నెల్‌కు ఇరువైపులాఈ ఉండిపోయిందని రిస్క్యూటీమ్ బృందాలు పేర్కొంటున్నాయి. కన్వేయర్ బెల్ట్ కొన్ని గంటలు మాత్రమే రన్ చేయడంతో 13 కిలోమీటర్ల పొడవునా గతంలోనే మిగిలిన మట్టి, కంక ర, టీబీఎం మిషన్‌కు తొలగించిన శకలాలు మా త్రమే బయటకు తేగలిగారని తెలుస్తున్నది.
కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో మృతదేహాల గుర్తింపు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు రెస్క్యూటీమ్ బృందం సభ్యులు టన్నెల్లో చర్చించుకోవడం కనిపించింది. సొరంగంలో తెగిపడిన కన్వేయర్ బెల్ట్‌ను అక్క డి నుంచే మరమ్మతులు చేయాల్సి ఉండడంతో దానిని బాగు చేసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశమున్నది. అప్పటి వరకు టన్నెల్లో నీటితోపాటు బు రద మరింత పేరుకుపోయే అవకాశం ఉన్నట్లు తెలిసిం ది. లోకో ట్రైన్ ద్వారా గతంలో మాదిరి బురదను తరలించేందుకు ఒక్క ట్రిప్పునకు దాదా పు 5గంటల సమయం పడుతుండడంతో, బురద మట్టి ని తొలగించేందుకు బెల్ట్ కు మరమ్మతులు చేయడమే సరైన నిర్ణయమని రెస్క్యూటీమ్ బృందా లు పేర్కొంటున్నాయి. ఒక్కో షిఫ్ట్‌గా దాదాపు 70 నుంచి 100 మంది రెస్క్యూటీమ్‌లు టన్నెల్లోకి వెళ్తున్నా తొలగించిన మట్టిని బయటకు తీసే మార్గమైన కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడంతో రెస్క్యూటీమ్ చేస్తున్న పనులకు ఫలితం లేకుండా పోతోంది.
టన్నెల్లో 13వ కిలోమీటర్ నుంచి 14 కిలోమీటరు వరకు నాలుగు వరుసల్లో ఏర్పాటు చేసిన సిమెం ట్ సెగ్మెంట్లు కూలిపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోం ది. ఈ ప్రమాదాన్ని బుధవారం రెస్క్యూటీమ్ బృందా లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. మరమ్మతులు చేపట్టిన కన్వేయర్ బెల్ట్ సాయంతో మట్టి, బురదను బయటకు తరలించడం రిస్క్యూటీమ్కు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తున్నది. ఇంతలోనే సొరంగం లోపలిభాగంలో బెల్ట్ అకస్మాత్తు గా తెగిపోవడంతో సహాయక చర్యలకు పూర్తిగా ఆ టంకం కలిగినట్లు రిస్క్యూటీమ్ బృందాలు పేర్కొంటున్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఫలానా చోట మృతదేహాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నది. ఏదేమైనా 12వ రోజులైనా టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ గుర్తించలేకపోవడంతో కార్మికుల కుటుంబాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
గల్లంతైన బాధిత కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. 12 రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా పురోగతి కనిపించడం లేదు. కా గా, నాసిరకం భోజనం పెడుతున్నారని రెస్క్యూ బృంద సభ్యులు ఆందోళన చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ సహాయక చర్యల పురోగతిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ రెస్క్యూ టీం అధికారులతో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డీపీవో ఫిరంగి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు.